Pawan Kalyan left AP cabinet meeting in the middle after hearing that his mother was unwell: మెగా మదర్ అంజనా దేవికి ఆరోగ్యం బాలేదని తెలుస్తోంది. ఆవిడ హెల్త్ సీరియస్ అని తెలియడంతో హుటాహుటిన అమరావతి నుంచి హైదరాబాద్ సిటీకి ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రయాణం అయ్యారు. 

క్యాబినెట్ మీటింగ్ మధ్యలో నుంచి వచ్చిన పవన్!అమరావతిలో మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ క్యాబినెట్ సమావేశం అయ్యింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం హాజరు అయ్యారు. అయితే... తల్లికి బాలేదని తెలియడంతో మీటింగ్ మధ్యలో నుంచి పవన్ వచ్చేశారు. వెంటనే హైదరాబాద్ బయలు దేరారు. మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదు. 

Also Readబ్రాహ్మణుడైన రావణుడు సీతను ఎత్తుకెళ్లలేదా? వారణాశి ఫైట్ - వివాదంపై దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి రియాక్షన్

అంజనా దేవికి ముగ్గురు కుమారులు. అందులో మెగాస్టార్ చిరంజీవి పెద్ద. తొలుత ఆయన ఇండస్ట్రీలోకి వచ్చారు. ఎటువంటి సినీ నేపథ్యం లేనప్పటికీ... తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. చిరంజీవి తర్వాత నాగబాబు, పవన్ కళ్యాణ్, వాళ్ళ సంతానం సైతం సినిమాల్లోకి వచ్చారు. పవన్ మినహా మిగతా అందరూ హైదరాబాద్ సిటీలో ఉన్నారు. తల్లికి బాలేదని తెలిసిన తర్వాత పవన్ హుటాహుటిన హైదరాబాద్‌కు వస్తున్నారు. 

Also Read: 'కన్నప్ప' ఓపెనింగ్ డే టార్గెట్ @ 100 కోట్లు... విష్ణు మంచు ఫస్ట్ డే సెంచరీ కొడతారా?