Upasana About Game Changer : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలలో ‘గేమ్‌ ఛేంజర్‌’ ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చెర్రీ ఫస్ట్ లుక్ మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే చాలా కాలంగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న 'గేమ్ చేంజర్' ఉపాసనకు చాలా స్పెషల్ మూవీ అంట. తనకు ఈ సినిమా ఎందుకు స్పెషల్ అనే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఉపాసన వెల్లడించింది.


'గేమ్ ఛేంజర్' నాకు చాలా స్పెషల్ మూవీ.. రిలీజ్ కోసం వెయిటింగ్


తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసనకి మీరు తమిళ్ సినిమాలు చూస్తారా? అని అడిగితే, ఉపాసన ఇలా బదులిచ్చారు. "తెలుగుతోపాటు తమిళ సినిమాలు కూడా చూస్తాను. ఈ మధ్య అయితే ఎలాంటి డబ్బింగ్ లేకుండా ఒరిజినల్ తమిళ్ మూవీస్ ని సబ్ టైటిల్స్ తో చూస్తున్నా. అలా రీసెంట్ టైమ్స్ లో చాలా తమిళ సినిమాలు చూసి ఎంజాయ్ చేశాను. ఈ సంవత్సరం రాబోయే సినిమాల కోసం కూడా వెయిట్ చేస్తున్నా. అందులో 'గేమ్ ఛేంజర్' కూడా ఒకటి. 'ఇండియన్ 2' మూవీ కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నేను శంకర్ సార్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కి ఫ్యాన్ ని. ముఖ్యంగా శంకర్ సార్ వైఫ్ చాలా స్వీట్ పర్సన్. 'గేమ్ ఛేంజర్' షూటింగ్ టైంలోనే నేను డెలివరీ అయ్యాను. అందుకే నాకు 'గేమ్ ఛేంజర్' మూవీ ఎప్పటికీ చాలా స్పెషల్" అంటూ చెప్పింది.


'గేమ్ ఛేంజర్' రిలీజ్ మరింత ఆలస్యం


'గేమ్ చేంజర్' సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు ఇటీవల ఓ మీడియా సమావేశంలో సెప్టెంబర్‌ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వినాయక చవితి కానుగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఆ డేట్ కు విడుదలయ్యే అవకాశం లేదని కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'OG' సినిమా సెప్టెంబర్ 27 విడుదల కాబోతోంది. ఇదే విషయాన్ని మేకర్స్ అదిరిపోయే పోస్టర్ తో అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో 'గేమ్ ఛేంజర్' విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.


శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో 'గేమ్ ఛేంజర్' పై భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ కార్తిక్‌ సుబ్బరాజు కథను అందించారు. ఇందులో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, సముద్రఖని, ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.


Also Read : జాన్వీకి మరో బిగ్ ఆఫర్ - మరో పాన్ ఇండియా హీరోతో రొమాన్స్?