రోడ్డు ప్రమాదంలో గాయపడి విశ్రాంతిలో ఉన్న సినీ హీరో సాయి ధర్మ్ తేజ్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఈ పరామర్శకు సంబంధించిన ట్వీట్‌ను సాయిధర్మ్ తేజ్ స్వయంగా చేశారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తనను పరామర్శించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 0కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదానికి గురైన తర్వాత నుంచి.. చాలా రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న సాయి ధర్మ్ .. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇంకా ఎలాంటి షూటింగ్‌లు పెట్టుకోలేదు. ప్రస్తుతం ఆయన ఫిజియోధెరపి చేయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
సెప్టెంబర్ 10వ తేదీన సాయి ధరమ్ తేజా హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపైన ప్రమాదానికి గురయ్యారు. రోడ్డుపై ఉన్న ఇసుక కారణంగా బైక్ స్కిడ్ కావడంతో ఆయన పడిపోయారు. విడుదలకు సిద్ధంగా ఉన్న తన రిపబ్లిక్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గురించి మాట్లాడేందుకు దర్శకుడు దేవా కట్టా ఇంటికి వెళ్తూండగా ప్రమాదం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న వారు సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అపోలోకు తరలించారు. 35 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు.
Also Read: ఒక్క పోస్టర్, ఒక్క డేట్‌తో రూమర్స్‌కు చెక్ పెట్టిన 'రాధే శ్యామ్' టీమ్!
డిశ్చార్జ్ అయిన తర్వాత చిరంజీవి ఒకటి రెండు సార్లు అందరితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. రిపబ్లిక్ సినిమా ఓటీటీలో రిలీజవుతున్న సమయంలోనూ మీడియాకు కొన్ని ఫోటోలు విడుదల చేశారు. అయితే అప్పుడు ముఖం కనిపించనీయలేదు. పూర్తి స్థాయిలో ఇప్పుడే ఆయన ఫోటోలు బయటకు వచ్చాయి. సాయిధర్మతేజ్ కొత్త సినిమా గురించి ... షూటింగ్‌లో పాల్గొనే తేదీల గురించి ఇంకా వెల్లడించాల్సి ఉంది.
Also Read: రెండు టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్స్‌లో తమిళ హీరోతో 'జాతి రత్నాలు' దర్శకుడి సినిమా