Ajaz Khan Absconding After Mumbai Police Case: ఉల్లు యాప్‌ ఓటీటీలో అడల్ట్ రియాలిటీ షో 'హౌస్ అరెస్ట్'లో (House Arrest) మితిమీరిన అశ్లీల కంటెంట్ ప్రసారం చేయడంపై ఇటీవల వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ ఫేం 'అజాజ్ ఖాన్' (Ajaz Khan) తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఈ షోను బ్యాన్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

లైంగిక వేధింపుల ఆరోపణలు.. అజాజ్ ఖాన్‌ పరారీ

అడల్ట్ షో వివాదంతో వార్తల్లో నిలిచిన అజాజ్ ఖాన్‌కు తాజాగా మరో షాక్ తగిలింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ హీరోయిన్ ముంబయిలోని చార్‌కోప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. 'హౌస్ అరెస్ట్' షోలో రోల్ ఆఫర్ చేశాడని.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని హీరోయిన్ ఆరోపించారు. ఈ క్రమంలో అజాజ్ పరారైనట్లు తెలుస్తోంది.

అజాజ్ ఖాన్‌ను సంప్రదించేందుకు యత్నించగా.. ఇంటి వద్ద అందుబాటులో లేడని పోలీసులు తెలిపారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉందని.. అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. మరోవైపు.. 'హౌస్ అరెస్ట్' షోలో అశ్లీల కంటెంట్ ప్రసారం చేసినందుకు కూడా మరో కేసులో పోలీసులు అజాజ్‌కు నోటీసులు జారీ చేశారు. అభ్యంతరకరమైన కంటెంట్ ప్రోత్సహించినందుకు అతనితో పాటు, ఉల్లు ఓటీటీ యాజమాన్యంపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది.

Also Read: ప్రతీ క్షణం భయం భయం.. ప్రాణాలతో చెలగాటం - హిట్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' సీజన్ 3 వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

అసలేంటి 'హౌస్ అరెస్ట్' షో.. వివాదం..

కొన్ని ఓటీటీలు పెద్దలకు మాత్రమే అనే కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతాయి. అలాంటి యాప్స్‌లో ఉల్లు యాప్ ఒకటి. ఈ యాప్‌లో మితిమీరిన అడల్ట్ కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌లో 'హౌస్ అరెస్ట్' రియాలిటీ షో ప్రసారం చేశారు. పేరుకే బిగ్ బాస్ తరహా షో కానీ.. లోపల జరిగేది అంతా పచ్చి బూతులే. ఈ షోలో కంటెస్టెంట్స్ బహిరంగంగానే శృంగారం గురించి.. పచ్చిబూతుల గురించి మాట్లాడుకుంటుంటారు. కొన్నిసార్లు అండర్ వేర్స్, ఎక్కువ భాగం డ్రెస్ తీసేసి మరీ పోటీలు పెట్టుకుంటుంటారు.

ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అజాజ్ ఖాన్ తనను తాను 'డాడీ ఆఫ్ ది హౌస్‌'గా పిలుచుకుంటారు. తాజాగా ఈ షోలో కంటెస్టెంట్స్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తిగా అసభ్యకర కంటెంట్ షోలో ప్రసారమైంది. ఓ మహిళా కంటెస్టెంట్ తనకు లైంగిక విషయాలతో పరిచయం లేదని చెప్పగా.. ఇతర కంటెస్టెంట్స్‌కు కెమెరా ముందే ఆ విషయాలను ప్రదర్శించాలని అజాజ్ ప్రోత్సహించాడు. కొందరు నటించాలని.. మరికొందరు డైరెక్ట్ చేయాలంటూ చెప్పాడు. దీంతో వారు అలానే చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లతో పాటు పలువురి నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఇలాంటి షోలను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు రాగా.. మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ షోను ఉల్లు యాప్ నిలిపేసింది. అంతే కాకుండా పోలీసులు కూడా అజాజ్‌కు నోటీసులు ఇచ్చారు.