Mega Family In London For Ram Charan Wax Statue Launching Event: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఫ్యామిలీ లండన్ (London) చేరుకున్నారు. చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్ - ఉపాసన దంపతులు, వీరి ముద్దుల కుమార్తె క్లీంకార, పెంపుడు శునకం రైమ్ లండన్‌లో ప్రత్యక్షమయ్యారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం
తనదైన మాస్ యాక్టింగ్, డ్యాన్స్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్‌కు (Ram Charan) అరుదైన గౌరవం లభించిన సంగతి తెలిసిందే. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఈ నెల 9న ఆవిష్కరించనున్నారు. ఈ ఈవెంట్ కోసమే మెగా ఫ్యామిలీ లండన్ చేరుకున్నారు. ఈ నెల 9న స్టాట్యూ ఆవిష్కరణ తర్వాత ఆ విగ్రహాన్ని శాశ్వతంగా సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలిస్తారు. దీంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 11న లండన్‌లోని ఫేమస్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో 'RRR' సినిమాను ప్రదర్శించనున్నారు. అక్కడ కీరవాణితో RRR సాంగ్స్ ఆర్కెస్ట్రా నిర్వహించిన.. ఆ తర్వాత రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్‌లతో క్వశ్చన్స్, ఆన్సర్స్ కార్యక్రమం కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో దాదాపు వారం రోజులకు పైగా లండన్‌లోనే మెగా ఫ్యామిలీ ఉండనున్నట్లు సమాచారం.
వివిధ రంగాల్లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖుల మైనపు విగ్రహాలను లండన్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచుతారన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఇండియాకు చెందిన ఎంతోమంది ప్రముఖుల విగ్రహాలను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్ విగ్రహాలను టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు. బాహుబలి మూవీ నుంచి ప్రభాస్ రోల్‌ను పోలి ఉండేలా రెబల్ స్టార్ విగ్రహం తయారుచేశారు. ఎంతో గౌరవం, గర్వంగా భావించే ఈ జాబితాలో చరణ్ కూడా చేరిపోయారు. చరణ్‌తో పాటు ఆయన పెట్ డాగ్ రైమ్‌లకు సంబంధించిన కొలతలు, ఫోటోలు, వీడియోలు తీసుకుని ఈ మైనపు బొమ్మను శరవేగంగా తయారు చేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' మూవీ చేస్తుండగా.. రామ్ చరణ్ 'పెద్ది'లో నటిస్తున్నారు. లండన్ టూర్ తర్వాత వీరు మూవీ షూటింగ్స్‌లో పాల్గొంటారు. 'పెద్ది' మూవీని ఉప్పెన ఫేం బుచ్చిబాబు తెరకెక్కిస్తుండగా.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో మూవీ రూపొందుతోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ట్రెండింగ్‌గా మారిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 27న 'పెద్ది' ప్రేక్షకుల ముందుకు రానుంది.