NTR Prashant Neel With Their Families Best Moment In Vacation: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో మూవీ 'డ్రాగన్' (ప్రచారంలో ఉన్న టైటిల్) కోసం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. ఇటీవలే ఎన్టీఆర్ షూటింగ్‌లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.
భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్
ఈ మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాస్ పల్స్‌కు తగ్గట్టుగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ఆయనపై కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా అది క్షణాల్లోనే ట్రెండ్ అవుతుందంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత బజ్ ఉందో.
ఫ్యామిలీస్‌తో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్
ఇక ఈ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్ దొరికినప్పుడల్లా ఎన్టీఆర్‌తో పాటు ప్రశాంత్ నీల్ తమ ఫ్యామిలీస్‌కు టైం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు తమ భార్యలతో సరదాగా ఉన్న ఫోటోలను ప్రశాంత్ నీల్ తన ఇన్ స్టా అకౌంట్‌లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్‌లకు బ్రేక్ సమయంలో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ వేస్తుంటారు. తాజాగా.. 'డ్రాగన్' (Dragon) మూవీ షూటింగ్ బ్రేక్ టైంలో వీరు సందడి చేశారు.
ఎన్టీఆర్, నీల్ వారి ఫ్యామిలీస్‌తో ఉన్న ఫోటోలను చూసి ఫ్యాన్స్, నెటిజన్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే, 'డ్రాగన్' మూవీకి సంబంధించి కూడా అప్ డేట్స్ ఇస్తే బాగుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ బర్త్ డేకు స్పెషల్ గిఫ్ట్స్
'డ్రాగన్' మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, టీ సిరీస్ ఫిలిమ్స్ (గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్) సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ కాగా.. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది జూన్ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు.. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'వార్ 2'. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తుండగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. మూవీలో ఎన్టీఆర్ 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తుండగా.. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా నుంచి కూడా ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఈ నెల 20 రిలీజ్ కానున్నాయనే టాక్ వినిపిస్తోంది.