Peddi Fever In IPL Sameer Rizvi Recreated Ram Charan Famous Shot: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన 'ఫేం' బుచ్చిబాబు  (Buchibabu) కాంబోలో మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'పెద్ది'. గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ ప్రధానాంశంగా మూవీ తెరకెక్కనుండగా.. ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ ట్రెండింగ్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ సిగ్నేచర్ షాట్‌తో అదరగొట్టారు. తాజాగా.. ఈ సిగ్నేచర్ షాట్ ఫీవర్ ఐపీఎల్‌కు సైతం చేరింది.

సిగ్నేచర్ షాట్‌తో ఢిల్లీ ప్లేయర్

సోమవారం ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ 'పెద్ది' గ్లింప్స్ రీక్రియేట్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. హైదరాబాద్ నగరాన్ని చూపిస్తూ 'పెద్ది' ఆడియో బ్యాక్ గ్రౌండ్‌లో ఈ వీడియో రీక్రియేట్ చేశారు. రామ్ చరణ్ సిగ్నేచర్ షాట్‌ను వీడియోలో ఢిల్లీ యువ ఆటగాడు రిజ్వీ సమీర్ అనుకరించారు.

ఈ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ తన అధికారిక 'X' ఖాతాలో షేర్ చేయగా.. 'పెద్ది' మూవీ టీం రీట్వీట్ చేసింది. రామ్ చరణ్ సైతం తన ఇన్ స్టా అకౌంట్‌లో వీడియో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన క్రికెట్ అభిమానులు వీడియో అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: అర్జున్ సర్కార్ సెంచరీ కొట్టేశాడు - నేచురల్ స్టార్ 'హిట్ 3' కలెక్షన్ల సునామీ

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం కావాలంటే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే. ఐపీఎల్‌లో 10 మ్యాచులు ఆడిన ఎస్ఆర్‌హెచ్ 3 మాత్రమే గెలిచింది. 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక 10 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరింట్లో నెగ్గి.. 12 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. 

ఇక పెద్ది సినిమా విషయానికొస్తే.. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన అందాల నటి జాన్వీ కపూర్ నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా 'పెద్ది' రిలీజ్ కానుంది.