Nani's HIT 3 Box Office Collections Day 4 Reached 100 Crores: నేచురల్ స్టార్ నాని (Nani) 'హిట్ 3' (HIT 3) రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. నాని కెరీర్‌లోనే దసరా, సరిపోదా శనివారం తర్వాత తక్కువ టైంలో ఈ మైలురాయి సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 4 రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు సాధించింది.
ఓవర్సీస్‌లోనూ..
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 4 రోజుల్లోనే రూ.101 కోట్లు వసూలు చేసింది 'హిట్ 3'. అటు ఓవర్సీస్‌లోనూ 2 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు మూవీ టీం తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. బాక్సాఫీస్ వద్ద నాని కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండడంతో మూవీ టీంతో పాటు ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కన్నీళ్లు పెట్టుకున్న బాలీవుడ్ యాక్టర్ కుమారుడు - మేమంతా పిచ్చోళ్లమా అంటూ 'బేబీ' డైరెక్టర్ రియాక్షన్
శైలేష్ కొలను ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అర్జున్ సర్కార్‌గా నాని అదరగొట్టారు. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీని నిర్మించారు. నాని సరసన కేజీఎఫ్ ఫేం 'శ్రీనిధి శెట్టి' నటించగా.. రావు రమేష్, కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు.
ఫస్ట్ డే రూ.43 కోట్లకు పైగా కలెక్షన్లు రాగా.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా రికార్డులకెక్కింది. ఇక రెండో రోజు కూడా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. మూడో రోజు రూ.82 కోట్లకు రీచ్ అయ్యింది. తాజాగా రూ.101 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. దీంతో మూవీ టీంలో ఫుల్ జోష్ నెలకొంది.
ఫ్యామిలీ ఆడియన్స్ సైతం
ఈ సినిమాలో వయలెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుందని.. అందుకు చిన్న పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు దూరంగా ఉండాలని మూవీ టీం ముందే క్లారిటీ ఇచ్చింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నాని మాస్ యాక్షన్, వయలెన్స్‌తో మూవీ సెకండాఫ్ మొత్త బ్లడ్ బాత్‌లానే కనిపిస్తుంది. అయితే, తొలి 2 రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు దూరంగా ఉండగా.. ఇప్పుడు వారు కూడా థియేటర్లకు వస్తున్నారు. ముఖ్యంగా లేడీస్‌కు నాని క్యారెక్టర్ నచ్చిందని.. సర్ ప్రైజింగ్‌గా అనిపించిందని డైరెక్టర్ శైలేష్ కొలను తెలిపారు.
ఇక కథ విషయానికొస్తే.. జమ్ముకశ్మీర్‌లో ఐపీఎస్ అధికారి అర్జున్ సర్కార్ (నాని).. హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో విధులు నిర్వహిస్తుండగా ఓ దారుణ హత్య వెలుగు చూస్తుంది. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో 13 హత్యలు జరుగుతాయి. వాటిని ఛేదించే క్రమంలో దీని వెనుక ఓ పెద్ద నెట్వర్క్ ఉందని గ్రహించిన అర్జున్.. వారి అరాచకాలను ఎలా అరికట్టాడు?, హత్యల వెనుక చీకటి కోణాలేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.