Prabhas 'Salaar' Movie : టాలీవుడ్ లో ఈ మధ్య అగ్ర హీరోల సినిమాలకి లీకుల బెడద అస్సలు తప్పడం లేదు. ముఖ్యంగా ప్రభాస్(Prabhas) సినిమాలకి వరుస లీకులు మేకర్స్ ని ఇబ్బంది పెడుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న 'సలార్'(Salaar) 'కల్కి'(Kalki), మారుతి సినిమాల నుంచి ఇప్పటికే కొన్ని లీక్స్ వచ్చాయి. మేకర్స్ షూటింగ్ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎవరో ఒకరు, ఎక్కడో చోట షూటింగ్ కి సంబంధించిన ఫుటేజ్ లేదా ఫోటోలు లీక్ చేస్తూనే ఉన్నారు. ఈమధ్య ప్రభాస్ 'సలార్' (Salaar) మూవీ నుంచి చాలానే లీకులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా సెక్యూర్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు.


ఇదిలా ఉంటే తాజాగా 'సలార్'(Salaar) మూవీకి సంబంధించిన కంటెంట్ ని సోషల్ మీడియాలో లీక్ చేసినందుకుగాను ఓ ఇద్దరిని సైబర్ క్రైమ్ (Cyber Crime) పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. తమ సినిమా కంటెంట్ విషయంలో ఎటువంటి అనుమతులు లేకుండా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇద్దరినీ పోలీసులకు అప్పచెప్పారట 'సలార్' మేకర్స్. అంతేకాదు తమ కంటెంట్ విషయంలో ప్రమేయం లేకుండా ఎవరైనా తప్పుడు పనులు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని సలార్ ప్రొడక్షన్ హౌస్ (Salaar Production House) నుంచి మీడియాకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. 'సలార్' రిలీజ్ దగ్గర పడడంతో లీకుల విషయంలో మూవీ టీం మరింత జాగ్రత్తగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.


ఈ క్రమంలోనే తమ సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్ చేసినా, కంటెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసినా సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి చిక్కులు తప్పవట. మరి ఇక నుంచి అయినా లీక్ రాయుళ్లు జాగ్రత్త పడతారా? లేదా అనేది చూడాలి. ఇక 'సలార్' సినిమాను డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్న ఇప్పటికీ అప్పుడే సలార్ మ్యానియా మొదలైపోయింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఇప్పటికే సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో అంటే నవంబర్ 20 నుంచి నార్త్ అమెరికాలో సలార్ మూవీ బుకింగ్స్ మొదలు కానున్నాయి.


ఓవర్సీస్ తో పాటుగా తెలుగులోనూ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మరోవైపు 'సలార్' బిజినెస్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. వాటిలో మైత్రీ మూవీ మేకర్స్.. 'సలార్'ను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా, పశ్చిమగోదావరి జిల్లా వరకు గీతా ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. తమిళనాట ఉదయనిధి స్టాలిన్ సంస్థ రెడ్ జెయింట్స్ సంస్థ, కేరళలో సలార్ విలన్ పృథ్వీరాజ్, కర్ణాటకలో హోంబలే ఫిలిమ్స్ సొంతంగా సినిమాను రిలీజ్ చేస్తోంది. నార్త్ ఇండియా(North India) డిస్ట్రిబ్యూషన్ డీటెయిల్స్ ని ఇంకా ప్రకటించాల్సి ఉంది.


Also Read : నాని రాజకీయ ప్రచారం - ఏ పార్టీ కోసమో తెలుసా?