Hi Nanna Movie : నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఏడాది 'దసరా'(Dasara) మూవీ తో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం 'హాయ్ నాన్న'(Hi Nanna) అనే సినిమా చేస్తున్నాడు. నాని ఓ సినిమా కోసం ఎంతలా కష్టపడతాడంటే సినిమా ఒప్పుకున్నామా, షూటింగ్ కంప్లీట్ చేశామా అన్నట్టు కాకుండా ఆ సినిమాని విడుదలయ్యేంత వరకు తన భుజాలపై మోస్తాడు. చాలా వెరైటీగా సినిమాని ప్రమోట్ చేస్తుంటాడు. ఈ యంగ్ జనరేషన్ హీరోల్లో ఓ సినిమాని ప్రమోట్ చేయాలంటే నాని తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. అలా ఇప్పటికే తాను నటించిన 'హాయ్ నాన్న'(Hi Nanna) ప్రమోషన్స్ ఓ రేంజ్ లో సాగుతున్నాయి.


ఇప్పటికే మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ విడుదలై ఆడియన్స్ నుంచి విశేష స్పందన అందుకుంది. ఈ మూవీ నుంచి ఒక్కో పాటను విడుదల చేసే ముందు నాని అందుకు తగ్గట్టు ముందు స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేసి ఆ తర్వాత సాంగ్స్ రిలీజ్ చేశాడు. ఎన్నడూ లేని విధంగా 'హాయ్ నాన్న' కోసం నాని ప్రమోషనల్ స్టైల్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. తాజాగా ఎలక్షన్స్ ని సైతం తన సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నాడు నాని. తన సోషల్ మీడియా వేదికగా నాని ఓ ఫోటోని షేర్ చేశాడు. అందులో పొలిటికల్ గెటప్ తో ఉన్న నానిని చూసి ముందు అందరూ షాక్ అయ్యారు.


ఈ ఫోటోను షేర్ చేసిన నాని.. "ఇది ఎలక్షన్ మూడ్. ఇందులో మనం ఎందుకు జాయిన్ కాకూడదు. డిసెంబర్ 7న మీ ప్రేమ, ఓటు మాకే అవ్వాలని, మీ హాయ్ నాన్న పార్టీ ప్రెసిడెంట్ విరాజ్" అంటూ రాస్కొచ్చాడు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్.. "నాని అన్న పొలిటికల్ గెటప్ లో అదిరిపోయాడు",  "చివరికి ఎలక్షన్స్ ని కూడా సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నావంటే నువ్వు గ్రేట్ అన్నా", "నీ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ నాని అన్నా" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏదీ ఏమైనా పొలిటికల్ లీడర్ గా నాని డ్రెస్సింగ్ స్టైల్ అయితే అదిరిపోయింది అంతే. ఈ పోస్ట్ తో ప్రమోషన్ చేయడంలో తన స్టైలే వేరని నాని మరోసారి నిరూపించుకున్నాడనే చెప్పొచ్చు.


ఇక 'హాయ్ నాన్న' విషయానికొస్తే.. శౌర్యువ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తండ్రి, కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డా.విజేందర్ రెడ్డి, KS మూర్తి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శృతిహాసన్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి హేషం వాహబ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు. సను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 7న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.


Also Read : రాజకీయాల్లోకి దర్శకుడు అనిల్ రావిపూడి - త్వరలోనే కొత్త పార్టీ కూడా?