Anil Ravipudi Political Entry : టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ప్రస్తుతం సోషల్ మీడియా నెటిజన్స్ వీటి గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అందుకు కారణం అనిల్ రావిపూడి పొలిటికల్ లుక్ లో దర్శనం ఇవ్వడమే. మరి ఈ డైరెక్టర్ పొలిటికల్ లుక్ వెనక ఉన్న స్టోరీ ఏంటి? డీటెయిల్స్ లోకి వెళ్తే.. టాలీవుడ్ లో ఒక్క ప్లాప్ కూడా లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత ప్రతి సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడిగా అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
రీసెంట్ గా బాలయ్యను 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari)గా చూపించి మరో సక్సెస్ అందుకున్నాడు. దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంది. 'భగవంత్ కేసరి'తో సక్సెస్ అందుకున్న ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ మూవీ గురించి ఏదైనా అప్డేట్ ఇస్తాడని అనుకుంటే ఉన్నట్టుండి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయనే ఓ వీడియోని రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అనిల్ రావిపూడి పొలిటికల్ లుక్ లో కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.
"నేను డైరెక్ట్ చేశాను, మీరు హిట్ చేశారు. నేను ఎంటర్టైన్ చేశాను, మీరు ఎంటర్టైన్ అయ్యారు. గెలిచేది నేనైనా గెలిపించేది మీరే. కానీ ఈసారి నాకు గెలుపు థియేటర్లో కాదు. అసెంబ్లీ.. ఓ పార్లమెంట్ ఇలా ప్లాన్ చేసుకుంటున్నా. బాక్సాఫీస్ సక్సెస్ చూసిన నాకు బ్యాలెట్ బాక్స్ సక్సెస్ చూడాలని ఉంది. మనం పార్టీ పెట్టబోతున్నాం. మన పార్టీ పేరేంటో, మన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరో మొత్తం ఇన్ఫర్మేషన్ తో త్వరలో వస్తా" అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో అందులో అనిల్ రావిపూడి పొలిటికల్ గెటప్ సోషల్ మీడియాతో వైరల్ గా మారాయి.
అసలు విషయం ఏంటంటే అనిల్ రావిపూడి నిజంగా పాలిటిక్స్ లోకి రావడం లేదు. ఇదంతా ఓ షో కోసం ప్లాన్ చేశారు. తెలుగు ఓటీటీ 'ఆహా'(AHA) దీన్ని ప్లాన్ చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి నెలకొన్న నేపథ్యంలో పొలిటికల్ కాన్సెప్ట్ తో ఓ షో ప్లాన్ చేస్తున్నారని, దానికి అనిల్ రావిపూడి యాంకర్ గా వ్యవహరిస్తారని సమాచారం. అందులో భాగంగానే ఈ ప్రోమోని రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. నిజంగానే ఇది షో కోసం చేస్తున్నారా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.
ఇక 'భగవంత్ కేసరి' సక్సెస్ తరువాత అనిల్ రావిపూడి తన తదుపరిచిత్రాన్ని మాస్ మహారాజా రవితేజతో చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'రాజా ది గ్రేట్'(Raja The Great) మూవీ సీక్వెల్ ని అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నట్లు సమాచారం. మరోవైపు మహేష్ బాబుతోనూ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు తెరపైకి వచ్చాయి. మరి అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఏ హీరోతో ఉండబోతుందో చూడాలి.
Also Read :రజినీకాంత్‌తో మూవీపై అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - ఆ సినిమాని మించి ఉండాలి!