Allu Sirish Photo Moment : టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కి మెగా, అల్లు ఫ్యామిలీస్ తో ఎంత మంచి బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, రామ్ చరణ్ లతో తారక్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక అల్లు ఫ్యామిలీలో అల్లు అర్జున్, తారక్ మధ్య ఫ్రెండ్షిప్ గురించి తెలిసిందే. బన్నీ, తారక్ ఇద్దరు బావా, బావా అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసి ఉంటారు. ఎన్టీఆర్ అంటే అల్లు అర్జున్ కి మాత్రమే కాదు అల్లు శిరీష్ కూడా చాలా ఇష్టమట. ఈ విషయాన్ని తాజాగా శిరీష్ ఓ స్పెషల్ పోస్ట్ రూపంలో తెలియజేశాడు. డీటెయిల్స్ లోకి వెళ్తే..


టాలీవుడ్ లో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ తారక్ ని ఇష్టపడుతుంటారు. తారక్ కూడా తన ఫ్యాన్స్ తో పాటు తోటి యాక్టర్స్ తో ఎంతో ప్రేమగా ఉంటారు. అందరితో త్వరగా కలిసిపోతారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో ఎన్టీఆర్ కి మంచి రిలేషన్షిప్ ఉంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా అందరితో తారక్ ఎంతో ప్రేమగా ఉంటాడు. వీరిలో మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ తో ఎన్టీఆర్ కి స్పెషల్ బాండింగ్ ఉంది. తాజాగా ఆ బాండింగ్ మరోసారి బయటపడింది. ఎన్టీఆర్ గురించి అల్లు శిరీష్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.






రీసెంట్ గా మెగాస్టార్ ఇంట్లో దివాలి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే కదా. ఈ సెలబ్రేషన్స్ కి నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు తో పాటు ఎన్టీఆర్ కూడా హాజరయ్యాడు. మెగా ఇంట జరిగిన ఈ వేడుకల్లో అల్లు ఫ్యామిలీ కూడా సందడి చేసింది. ఇప్పటికే ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సెలబ్రేషన్స్ తర్వాత అల్లు శిరీష్ తాజాగా ఎన్టీఆర్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.." ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఎవరు ఎప్పుడు తనతో ఓ ఫోటో అడిగినా తారకన్నా అందరితో ఒకేలా ఉంటారు. వారికి ప్రేమతో ఒక ఫోటో ఇస్తారు. చాలా దయగల మనిషి" అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది.


ఈ పిక్ చూస్తున్న ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. "ఒకే ఫ్రేమ్ లో నందమూరి, అల్లు హీరోస్ అదిరిపోయారు", "తారక్ అన్న స్మైల్ సూపర్", "బన్నీతో తారక్ అన్న కలిసి ఉన్న ఫోటో కూడా షేర్ చేయండి" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర'(Devara) అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల గోవా షెడ్యూల్ ముగించుకొని హైదరాబాద్ కి వచ్చిన మూవీ టీం కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు ప్రధాన తారాగణం షూటింగ్ లో పాల్గొంటున్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్-1(Part-1) వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’ - స్ట్రీమింగ్‌ ఎందులో అంటే?