Anasuya Is Troubled In Deep Blouse: అనూయ భరద్వాజ్ గురించి తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను ఎతంగానో అలరించిన ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం నటిగా వెండితెరపై సందడి చేస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా, ‘పుష్ప’ సినిమాలో కాత్యాయనిగా నటించి ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. చక్కటి పాత్ర లభిస్తే నటించేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటుంది.  తాజాగా ‘విమానం’, ‘ప్రేమ విమానం’, ‘పెద్దకాపు’లాంటి సినిమాలతో ప్రేక్షకులను బాగా అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సహా పలు సినిమాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పడు తన అందాల కనువిందుతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఆమె గ్లామరస్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తాయి.


రాయచోటిలో అనసూయ సందడి


ఓవైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతూనే మరోవైపు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లోనూ పాల్గొంటుంది అనసూయ. తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లా రాచచోటిలో ఈ అందాల తార సందడి చేసింది. నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించింది. అనసూయను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనాలు తరలి వచ్చారు. దీంతో ఆ ప్రాంతం అంతా జనసంద్రంగా మారిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.


డీప్ బ్లౌజ్ తో ఇబ్బంది పడ్డ అనసూయ


ఇక అందాల ప్రదర్శనలో తనకు తానే సాటి అని అనసూయ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది. ఎలాంటి  దుస్తులు ధరించినా జనంతో పాటు కెమెరా లెన్స్ తన మీద ఫోకస్ చేసేలా జాగ్రత్త పడుతుంది. మోడ్రన్ డ్రెస్సులు అయినా, సంప్రదాయ చీరలో అయినా అందాలను ఒలికించడంలో ఆమె తర్వాతే మరెవరైనా అని చెప్పుకోవచ్చు. రాయచోటి షాపింగ్ మాల్ ఓపెనింగ్ లోనూ చీరకట్టుతో మైమరపించింది అనసూయ. ఆమె వేసుకున్న బ్లౌజ్ మరింత ఆకర్షణగా నిలిచింది. బ్లౌజ్ మరీ డీప్ గా ఉండటంతో అక్కడికి వచ్చిన వారితో పాటు కెమెరా కళ్లన్నీ అటువైపే ఫోకస్ పెట్టాయి. చాలా సార్లు బ్లౌజ్ ను సరి చేసుకుంటూ ఇబ్బందిగా ఫీలయ్యింది అనసూయ. అదే సమయంలో అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేసింది.     






‘పుష్ప 2’ కోసం చాలా కష్టపడుతున్నాం- అనసూయ


షాపింగ్ మాల్ ఓపెనింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన అనసూయ తన సినిమాల గురించి పలు విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా ‘పుష్ప 2’ గురించి చాలా విషయాలు పంచుకుంది. ఈ సినిమా కోసం చాలా మంది పగలనకా, రాత్రనకా కష్టపడుతున్నట్లు చెప్పింది. హీరో అల్లు అర్జున్ ఈ సినిమా కోసం గతంలో ఎప్పుడూ లేనంత హార్డ్ వర్క్ చేస్తున్నారని వెల్లడించింది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను ప్రాణం పెట్టి తీస్తున్నట్లు తెలిపింది. చిత్తూరు యాస చాలా కష్టంగా ఉంటుందని చెప్పిన అనసూయ, అల్లు అర్జున్, సుకుమార్ మాత్రం ఈజీగా మాట్లాడేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ సినిమా సగానికి పైగా కంప్లీట్ అయినట్లు చెప్పింది. ‘పుష్ప 2’ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తాయని వెల్లడించింది అనసూయ.


Read Also: ఆ విషయంలో సంతృప్తి లేదు - అందుకే టాలీవుడ్ కు గ్యాప్ వచ్చింది: హన్సిక