ప్రపంచ సినిమా వేదికపై భారతీయులు అందరూ గర్వంగా తలెత్తి చూసేలా చేసిన పాట 'నాటు నాటు...'. తెలుగు పాటకు ఆస్కార్ తీసుకు వచ్చింది. ఆ గీతం వెనుక ఉన్నది లిరిసిస్ట్ చంద్రబోస్ (Chandrabose). ఆయనను 'పర్‌ఫ్యూమ్' యూనిట్ ఘనంగా సత్కరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...


Perfume Telugu Movie 2023: జీడీ స్వామి దర్శకత్వంలో జె. సుధాకర్, శివ .బి, రాజీవ్ కుమార్ .బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) సంయుక్తంగా నిర్మించిన 'పర్‌ఫ్యూమ్'. ఇందులో చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించారు. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ సంస్థలు తెరకెక్కించాయి. ఈ నెల 24న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా గురువారం రాత్రి ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అందులో చంద్రబోస్, సుచిత్ర దంపతులను సత్కరించారు. చంద్రబోస్ మీద పాట రాసి, ఆయన ముందు పాడి వినిపించారు.


ఇప్పటి వరకు తాను 3700 పాటలు రాశానని, ఈ రోజు తనపై ఓ పాట రాసి తనకు బహుమతిగా ఇచ్చిన 'పర్‌ఫ్యూమ్' చిత్ర బృందానికి కృతఙ్ఞతలు అని చంద్రబోస్ సంతోషం వ్యక్తం చేశారు. ఆస్కార్ అందుకున్న సందర్భాన్ని మళ్ళీ చూడటంతో భావోద్వేగానికి లోనయ్యానని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''దర్శకుడు జేడీ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో నేను ఓ పాట రాశా. సంగీత దర్శకుడు అజయ్ చక్కటి బాణీ అందించారు. ఇందులో ఓ పాటకు కొరియోగ్రఫీ చేసిన నా సతీమణి సుచిత్రకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి పెద్ద విజయాన్ని అందించాలి'' అని అన్నారు.  


తన దగ్గర ఓ సినిమాకు దర్శకత్వ శాఖలో పని చేసిన నగేష్ ఈ సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేశారని, ఆయన దగ్గర ఎన్నో క్రియేటివ్ ఐడియాలు ఉన్నాయని, ఈ సినిమా సక్సెస్ అవ్వాలని అవసరాల శ్రీనివాస్ చెప్పారు. ''రెండేళ్ల క్రితం దర్శకుడు జేడీ నాకు ఈ ఐడియా చెప్పారు. ఎంతో మంది దగ్గరకు వెళ్లాం. కొందరికి కథే అర్థం కాలేదు. చివరకు, హీరో క్యారెక్టర్ నేను చేశా. సుచిత్రా చంద్రబోస్ గారు చేసిన సహాయం ఎప్పటికీ మరువలేను. స్మెల్లింగ్ అబ్‌సెషన్‌తో కూడిన కథను ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదు'' అని చేనాగ్ అన్నారు. 


Also Read మంగళవారం సినిమా రివ్యూ: అమ్మాయిలో లైంగిక వాంఛ ఎక్కువ అయితే? కోరికలు పెరిగితే?



కొత్త తరహా కథతో తెరకెక్కించిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నట్లు దర్శకుడు జేడీ తెలిపారు. తనకు గురువు చంద్రబోస్ స్ఫూర్తి అని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో చెప్పారు. చంద్రబోస్ గారితో పని చేయడం ఆనందంగా ఉందని చిత్ర సంగీత దర్శకుడు అజయ్ చెప్పారు. 'పర్‌ఫ్యూమ్' ప్రీ రిలీజ్ వేడుకలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్. విష్ణుమూర్తి, ఐఆర్ఎస్ మురళీ మోహన్, గ్రీన్ హార్స్ కంపెనీ అధినేతి ప్రవీణ్ రెడ్డి, ఆచార్య భట్టు రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 


Also Read 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' సినిమా రివ్యూ: రక్షిత్ శెట్టి బ్లాక్ బస్టర్ కొట్టారా? డిజప్పాయింట్ చేశారా?