Jetty OTT release date When and where to watch the movie : థియేటర్లలో విడుదలైన రెండు మూడు వారాలకు ఓటీటీల్లోకి సినిమాలు వస్తున్న రోజులు ఇవి. అటువంటిది ఓ సినిమా థియేటర్లలో విడుదలైన ఏడాది తర్వాత ఓటీటీలోకి రావడం కాస్త విశేషమే కదా! అసలు వివరాల్లోకి వెళితే...


ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న 'జెట్టి'
మానినేని కృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమా 'జెట్టి' (Jetty Telugu Movie). ఈ చిత్రంలో ఆయనకు జోడీగా నందితా శ్వేత (Nandita Swetha) నటించారు. కృష్ణ, 'కన్నడ' కిశోర్, 'మైమ్' గోపి, శివాజీ రాజా, జీవా, ఎంఎస్ చౌదరి, సుమన్ శెట్టి ప్రధాన తారాగణం. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై కె వేణు మాధవ్ నిర్మించారు. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వం వహించారు. 


Jetty Streaming Response Aha OTT : 'జెట్టి' సినిమా గత ఏడాది నవంబర్ 4న థియేటర్లలో విడుదలైంది. ఏడాది తర్వాత, ఇవాళ (నవంబర్ 17, శుక్రవారం) ఆహా ఓటీటీ వేదికలోకి వచ్చింది. గురువారం మిడ్ నైట్ నుంచి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు రాష్ట్రంలోని ఓ సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారుల జీవన విధానాన్ని చూపిస్తూ తెరకెక్కించిన ‘చిత్రమిది. 


థియేటర్లలో 'మంగళవారం'... 
ఓటీటీ వేదికలో 'జెట్టి' చిత్రం!
నందితా శ్వేతా (Nandita Swetha)కు ఇప్పుడు డబుల్ డిలైట్ అని చెప్పాలి. ఆమె కథానాయికగా నటించిన 'జెట్టి' ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మరో వైపు ఆమె ఖాకి షర్టు వేసి పోలీసుగా కీలక పాత్రలో నటించిన 'మంగళవారం' పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల అయ్యింది. ఆ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది. వెండితెర, డిజిటల్ తెర... రెండు చోట్ల ఆమె సందడి ఉంది అన్నమాట! 


Also Read మంగళవారం సినిమా రివ్యూ: అమ్మాయిలో లైంగిక వాంఛ ఎక్కువ అయితే? కోరికలు పెరిగితే?


గ్రామీణ నేపథ్యం, అక్కడి కట్టుబాట్లు, ఆచార సంప్రదాయాలు, మత్స్యకారుల జీవన విధానంపై తీసిన 'జెట్టి' చిత్రాన్ని సహజత్వానికి అద్దం పట్టేలా తెరకెక్కించారని వీక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. థియేటర్లలో విడుదలైన సమయంలో మంచి స్పందన లభించిందని, అప్పుడు చూడలేని ప్రేక్షకులు ఇప్పుడు చూస్తున్నారని పేర్కొన్నారు. మొదటి సినిమాలో హీరో మానినేని కృష్ణ యాక్షన్ సీక్వెన్సులలో అదరగొట్టేశాడని చెబుతున్నారు. 


ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్టులు అందరినీ ఆకట్టుకుంటాయని, చివరి 20 నిమిషాలు ఉద్వేగభరితంగా ఉంటుందని, ముఖ్యంగా తండ్రి కుమార్తెల మధ్య భావోద్వేగభరిత సన్నివేశాలకు ప్రతీ ఒక్కరూ కంట తడి పెడుతున్నారని చిత్ర బృందం పేర్కొంది. మాటల రచయిత శశిధర్ వేమూరి మంచి సంభాషణలు అందించారని చెప్పారు. 


Also Read 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' సినిమా రివ్యూ: రక్షిత్ శెట్టి బ్లాక్ బస్టర్ కొట్టారా? డిజప్పాయింట్ చేశారా?



'జెట్టి' సినిమాలో పాటలను ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, శ్రీమణి, కాసర్ల శ్యామ్ రాశారు. సిద్ శ్రీరామ్, శంకర్ మహదేవన్, మంగ్లీ, అనురాగ్ కులకర్ణి, విజయ్ యేసుదాస్, సునీత వంటి టాలెంటెడ్ సింగర్స్ ఆలపించారు. యూట్యూబ్, సాంగ్స్ యాప్ వంటి డిజిటల్ మీడియా వేదికల్లో సిద్ శ్రీరామ్ పాడిన పాటకు 22 మిలియన్ వ్యూస్ వచ్చాయి.