Copy Allegations on Pushpa 2 Second Song: ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప: ది రూల్'. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ నుంచి వరుసగా అప్‌డేట్స్ వదులుతున్నారు మూవీ టీం. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి' అంటూ సాగే పాటు సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం పుష్ప 2 సెకండ్ సింగిల్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఈ పాట మారుమోగుతుంది. ఇక అంతగా ఆకట్టుకుంటున్న ఈ పాటకు కాపీ మరక అంటుకుంది. ఈ సాంగ్‌ను దేవిశ్రీ ప్రసాద్ కాపీ చేశాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. కాగా పుష్ప: ది రూల్ మూవీకి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌కి కూడా ఆయనే మ్యూజిక్ అందించారు. పుష్ప: ది రైజ్ లోని పాటలన్ని బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాయి. మ్యూజిక్ పరంగా సెన్సేషన క్రియేట్ చేశాయి. ఇక పార్ట్ 2లోని ఫస్ట్ సాంగ్‌కి కూడా ప్రేక్షకులు నుంచి విశేష స్పందన వచ్చింది.
కానీ, సెకండ్ సాంగ్ మాత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఓ వర్గం వారిని విపరీతంగా ఆకట్టుకుంటుంటే మరికొందరికి మాత్రం ఈ పాటలో మాస్ అప్పీల్ తగ్గిందంటున్నారు. అలాగే ఈ సాంగ్‌కి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్‌ను దేవిశ్రీ తెలంగాణ జానపద గేయం నుంచి లేపేశాడంటూ విమర్శిస్తున్నారు. ఈ మేరకు ఈ రెండు సాంగ్స్‌ని పోల్చుతూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్ట్స్ పుట్టుకొస్తున్నాయి.టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి కాపీ ఆరోపణలు రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఏంటీ దేవి చూసుకోవాలి కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు తమన్‌ని ఫాలో అవుతున్నావా? ఏంటీ అంటూ దేవిశ్రీపై కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: కొంచం కూడా సభ్యత లేని ఈ మనిషి ఎవరు? - బాలకృష్ణ, అంజలి వీడియోపై స్టార్ డైరెక్టర్ ఘాటు వ్యాఖ్యలు
కాగా దేవిశ్రీపై కాపీ ఆరోపణలు రావడం ఇదేం కొత్త కాదు. గతంలోనూ ఆయన చాలాసార్లు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక తమన్ అయితే తరచూ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కుంటూనే ఉన్నాడు. రీసెంట్ గేమ్ ఛేంజర్‌కి పాటకు కూడా తమన్ కాపీ కొట్టాడంటూ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇకపోతే దేవిశ్రీ పుష్ప 1కి ఇచ్చిన సంగీతం, బీజీఎమ్ నెక్ట్స్ లెవన్ అని చెప్పాలి. ఈ మూవీ సక్సెస్‌లో దేవిది కూడా కీ రోల్ ఉందని చెప్పాలి. అతడు స్వరపరిచిన శ్రీవల్లి సాంగ్, సామీ సామీ, ఊ అంటావా మామా ఊఊ అంటావా పాటలు యూట్యూబ్ షేక్ చేశాయి. ఇక ఆడియన్స్ అయితే ఈ పాటలకు స్టేప్స్ వేయకుండ ఉండలేకపోయారు. ఒక్క ఇండియాలోనే కాదే వరల్డ్ వైడ్ పుష్ప పాటలు మారుమోగాయి. అంతా హిట్ ఇచ్చిన దేవిశ్రీ ఈ పుష్ప 2 విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.