ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా వెలుగొందుతున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. డైరెక్షన్ తో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. అలాంటి ఈ అగ్ర దర్శకుడి పై ట్రోల్స్ మాత్రం అస్సలు ఆగడం లేదు. సోషల్ మీడియా వచ్చాక ఎంత పెద్ద స్టార్ హీరో, డైరెక్టర్ అయినా కూడా వాళ్ల తప్పుల్ని నెట్టిజన్లు ఎత్తిచూపుతున్నారు. ట్రోల్స్ తో ఆడేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ 'బ్రో' మూవీ టీజర్ రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ మీద భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సాయి, తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'బ్రో' సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కూడా అదిరిపోయింది.
అయినా త్రివిక్రమ్ పై ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయంటే? అందుకు కారణం మన బుట్ట బొమ్మ పూజ హెగ్డే అని అంటున్నారు. 'బ్రో' టీజర్ కు ముందు పూజా హెగ్డే నటించిన ఓ కమర్షియల్ యాడ్ ఇప్పుడు నెటిజన్ల కంటపడింది. దాంతో పూజ హెగ్డే లేనిదే గురూజీ సినిమా చేసేలా లేరుగా? అంటూ త్రివిక్రమ్ ని ఆడేసుకుంటున్నారు. మరి కొంతమంది నెటిజెన్స్ అయితే ఈ యాడ్లో నటించేందుకే పూజా హెగ్డే ను మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా నుంచి తప్పించి ఉంటారంటూ చెబుతున్నారు. 'బుట్ట బొమ్మను వదిలేదేలే', 'పూజ హెగ్డే లేనిది గురూజీ సినిమాలు తీయరా?', 'ఏదో విధంగా బుట్ట బొమ్మ కనిపించాల్సిందే', 'త్రివిక్రమ్ లక్కీ హీరోయిన్ పూజ హెగ్డే' అంటూ రకరకాల కామెంట్స్ తో నెటిజెన్స్ త్రివిక్రమ్ పై ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.
దీంతో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా త్రివిక్రమ్ హాట్ టాపిక్ గా మారుతున్నారు. కాగా త్రివిక్రమ్, పూజ హెగ్డే కాంబినేషన్లో ఇప్పటికే 'అరవింద సమేత', 'అలవైకుంఠపురంలో' వంటి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకున్నాయి. దాంతో పూజ హెగ్డే త్రివిక్రమ్ కి గోల్డెన్ హీరోయిన్గా మారిపోయింది. అందుకే రీసెంట్ టైమ్స్ లో పూజ హెగ్డే వరుస ప్లాప్స్ అందుకున్నా కూడా త్రివిక్రమ్ మహేష్ బాబుతో చేస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకున్నారు. కానీ ఈ మధ్య పూజా హెగ్డే మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
పూజా హెగ్డే ని తీసేసి ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అనుకున్న శ్రీ లీలను మెయిన్ హీరోయిన్ ఫిక్స్ గా చేశారని, అలాగే రెండవ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇంకా మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. కాగా ఇటీవల రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ 'బ్రో' టీజర్ కి ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తమిళ నటుడు, దర్శకుడు అయిన సముద్రఖని ఈ సినిమాని తెరకెక్కించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'వినోదయ సీతం' అనే సినిమాకి ఇది తెలుగు రీమేక్ తెరకెక్కింది. జూలై 28న గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమాని జి స్టూడియోస్‌తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
Also Read : కోలీవుడ్ స్టార్ ధనుష్ పై నిషేధం? నిర్మాతల మండలి షాకింగ్ నిర్ణయం?