మాటల మాంత్రికుడిగా పేరు పొందిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). మెగా ఫోన్ పట్టుకోకముందు రచయితగా ఆయన పాపులర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న మొదటి రచయితగా రికార్డు సృష్టించారు. దర్శకుడిగా ఆయన చేసిన సినిమాలు - అందుకున్న విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర సహాయ దర్శకులుగా పని చేయడానికి చాలా మంది యువకులు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ కుమారుడు రుషి మనోజ్ మాత్రం మరొక దర్శకుడు దగ్గర సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.

ప్రభాస్ సినిమాకు సహాయ దర్శకుడిగా రిషి!?Prabhas Spirit Update: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న సినిమా 'స్పిరిట్'. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.‌ ఈ సినిమాకు త్రివిక్రమ్ కుమారులలో ఒకరైన రిషి సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారని టాక్. 

'అర్జున్ రెడ్డి'తో సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా పరిచయం అయ్యారు.‌ మొదటి సినిమా ఆయనకు మంచి పేరు తీసుకు వచ్చింది. ఆయన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ గురించి చాలా మంది మాట్లాడుకున్నారు. 'అర్జున్ రెడ్డి' తర్వాత హిందీలో షాహిద్ కపూర్ 'కబీర్ సింగ్', రణబీర్ కపూర్ 'యానిమల్' సినిమాలు చేశారు సందీప్. ప్రభాస్ హీరోగా త్వరలో పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'స్పిరిట్'ను సెట్స్ మీదకు తీసుకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు రిషి వర్క్ చేస్తున్నాడనే విషయం టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు తీశారు. నితిన్ హీరోగానూ ఒక సినిమా చేశారు. దర్శకుడిగా మాత్రమే కాదు రచయితగా కూడా ప్రభాస్ సినిమాకు ఆయన వర్క్ చేసింది లేదు. అయితే ఇప్పుడు ఆయన కుమారుడు ప్రభాస్ సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేస్తుండడం విశేషం.

Also Readతాతయ్య ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు నన్నెవరూ ఆపలేరు - 'వార్ 2' ఈవెంట్‌లో తారక్

త్రివిక్రమ్ కుమారుడు రిషి మనోజ్ కొన్ని రోజులుగా దర్శకత్వానికి సంబంధించి మెళకువలు నేర్చుకునే పనిలో ఉన్నారు. 'నిశాచరుడు' అనే షార్ట్ ఫిలిం చేశారు. అందులో నటించారు. దానికి దర్శకుడు కూడా అతడే. అలాగే మరొక షార్ట్ ఫిలిం 'స్టాగనేషన్'కు ఎడిటర్ కింద వర్క్ చేశారు. రవితేజ కుమారుడు సైతం ప్రభాస్ 'స్పిరిట్; సినిమాకు సహాయ దర్శకుడుగా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదట. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఇందులో కొరియన్ స్టార్ డాన్ లీ కూడా నటిస్తాడని టాక్. 

భద్రకాళి పిక్చర్స్ పతాకం మీద బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ టి సిరీస్ భాగస్వామ్యంతో 'స్పిరిట్' సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడు. ఇందులో యానిమల్ ఫ్రేమ్ తృప్తి దిమ్రి హీరోయిన్.

Also Readమాటలు రాని వీరాభిమానికి ఎన్టీఆర్ సర్‌ప్రైజ్... 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ సీన్