Samudrakani on Bro Movie : తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'బ్రో'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా.. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో.. మూవీ యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అందులో భాగంగా డైరెక్టర్ సముద్ర ఖని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా ఎలా మొదలైందో చెబుతూ... అందుకు త్రివిక్రమ్ పాత్రను వివరిస్తూ పలు ఇంట్రస్టింగ్ సన్నివేశాలను తన మాటల్లో చెప్పారు.


'బ్రో' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సముద్రఖని.. అసలు ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది, అది పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ వద్దకు ఎలా వెళ్లిందన్న విషయాలను చెప్పారు. 'బ్రో' మూవీ.. ఓటీటీ కోసం తీసిన తమిళ సినిమా 'వినోదయ సీతమ్' కు రీమేక్ అంటూ చెప్పుకొచ్చారు. 100 నిమిషాలు ఉండే ఈ స్టోరీలో ఎలాంటి బ్రేక్స్ లేవన్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ సమయంలో తాను తెలుగులో ‘భీమ్లా నాయక్’ చేస్తున్నానని సముద్రఖని తెలిపారు. ఒకానొక సందర్భంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దగ్గర 'వినోదయ సీతమ్' గురించి ప్రస్తావన వచ్చిందన్నారు.


రీసెంట్ గా ఓ ఓటీటీ ఫిల్మ్ చేశానని, అందులోని కంటెంట్‌ను తివిక్రమ్‌కు చెప్పాన్నారు. ఆ సినిమాలోని లాస్ట్ డైలాగ్ చెప్పడంతో.. త్రివిక్రమ్ వెంటనే.. ఈ సినిమాలో నువ్వు యాక్ట్ చేయాలనుకుంటున్నావా అని అడిగారని చెప్పారు. దానికి సమాధానంగా.. నేను యాక్ట్ చేయనని.. డైరెక్ట్ చేయాలనుకుంటున్నానని.. ఈ విషయం ప్రజలకు చెప్పాలని చెప్పినట్టు సముద్రఖని తెలిపారు. "అందరూ ఫ్యూచర్ అంటుంటారు కానీ.. అసలు ఫ్యూచర్ అనేది లేనే లేదు. అన్నీ ప్రజెంటే.. ఈ విషయం జనాలకు చెప్పాలనుకుంటున్నా" అని త్రివిక్రమ్ తో చెప్పినట్టు ఆయన అన్నారు. కానీ ఈ సినిమాను మీరు లీడ్ చేయండని చెప్పగానే.. ఆయన తనను 5 నిమిషాలు చూసి.. వెంటనే కళ్యాణ్ సర్ చేస్తే ఓకేనా అనగానే తాను చాలా సంతోషించానని చెప్పారు. అలా 'బ్రో' సినిమా కథ, స్ర్కీన్ ప్లేను సెట్ చేసి.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలని చెప్పినట్టు ఆయన తెలిపారు. ఈ సినిమాను మనం తెలుగులో రీమేక్ చేస్తున్నామని త్రివిక్రమ్ అన్నారన్నారు. అలా త్రివిక్రమ్ కేవలం 10 నిమిషాల్లోనే స్క్రీన్‌ప్లే మార్చేశారని చెప్పారు. 


జీ 5తో చేయడానికి కారణమేంటంటే..


జీ 5 చెప్పిన దాని ప్రకారం 25 నిమిషాల్లో 5 స్ర్కిప్టులు చెప్పాలి. కానీ నేను మాత్రం కేవలం 20 నిమిషాల్లోనే 5 స్టోరీలు చెప్పాను. అందులో ఒకటి సెట్ అయింది కూడా. ఇంకా 3 నిమిషాలు ఉంది. అయితే ఇంకా 3 నిమిషాలు ఉంది కదా.. ఇంకో స్టోరీ చెప్తానన్నాను. ఆ 3 మినిట్స్ లో చెప్పిన స్టోరీనే ఇది. ఇది చెప్పగానే అన్నీ ఆపేసి, దీన్ని ఫస్ట్ చేద్దామన్నారు.


Read Also : Indian 2 Movie: దర్శకుడు శంకర్ హైటెక్ ప్రయోగం - చనిపోయిన ఆ ఇద్దరు కూడా ‘భారతీయుడు-2’లో నటిస్తారట!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial