ఈ ఫొటోలో బికినీలో ఉన్న హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఈ మధ్యే ఆమె ఓ తెలుగు డైరెక్టర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీలో మెరిసింది. మన నేషనల్ క్రష్‌ రష్మికను సైతం వెనక్కి నెట్టి.. లేటెస్ట్ క్రష్‌గా కుర్రాళ్ల మనసు దోచేస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆమె మరెవ్వరో కాదు.. త్రిప్తి దిమ్రి.


‘యానిమల్’ మూవీ బాలీవుడ్ లో సృష్టించిన సంచలనం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రూ. 950 కోట్లకు పైగా వసూళు చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో జోయా రియాజ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ త్రిప్తి దిమ్రి. ఈ సినిమాకు ముందు పలు చిత్రాల్లో నటించినా, ఈ మూవీతోనే బోలెడు క్రేజ్ సంపాదించుకుంది. కుర్రాళ్ల గుండెల్లో అలజడి సృష్టించింది. ‘యానిమల్’ సినిమాతో వచ్చిన పాపులారిటీతో వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి. కొన్ని చిత్రాలు విడుదలకు రెడీ అవుతుండగా, మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.     


ఇటలీ వెకేషన్ లో త్రిప్తి గ్లామర్ మెరుపులు


ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా ఫారిన్ లో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఇటలీలో వెకేషన్ లో ఉన్న ఆమె.. అక్కడి బీచులలో సరదా సరదాగా గడుపుతోంది. చిట్టిపొట్టి దుస్తులో అందాల కనువిందు చేస్తోంది. స్విమ్ సూట్ తో పాటు బికినీలోనూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. తాజా వెకేషన్ కు సంబంధించి ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు కుర్రాకారుకు కిక్కెక్కిస్తున్నాయి. తను ఎంజాయ్ చేసే ప్రతి మూవ్ మెంట్ ను కెమెరాలో బంధిస్తోంది. హోటల్ లో లేలేత భానుడి కిరణాలు మీద పడుతుండగా బంగారు వర్ణంలో మెరిసిపోతూ కనిపించింది. ‘హ్యాపీ యాజ్ ఏ-షెల్ ఎమోజీ’ అని క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఈ ఫోటోలు చూసి క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. “మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ హాట్ వేవ్స్ రావాల్సిందే” అంటున్నారు.






ఇక ఇటలీ హాలీడే ట్రిప్ లో భాగంగా ఇటలీ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను కూడా త్రిప్తి తన అభిమానులతో పంచుకుంది. ఇటలీలో సూర్యుడు అస్తమిస్తున్న అద్భుత దృశ్యాలను తన కెమెరాలో క్యాప్చర్ చేసింది. స్కూటీ మీద రైడ్ చేస్తూ కనిపించింది. చీకటి పడ్డాక చంద్రుడి వెలుగుల్లో వీధుల్లో నటిస్తూ కనిపించింది. ఈ ఫోటోలకు ‘గోల్డెన్ గ్లిట్టర్’ అంటూ క్యాప్షన్ రాసింది. అంతకు ముందు ‘ఇదుగో.. ఇటలీ చూడండి’ అంటూ షేర్ చేసిన ఫోటోలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.






వరుస సినిమాలతో ఫుల్ బిజీ


త్రిప్తి దిమ్రి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. కార్తీక్ ఆర్యన్ తో కలిసి ‘భూల్ బులయ్య’ చిత్రంలో నటిస్తోంది. కరణ్ జోహార్ మూవీ ‘దఢక్ 2’లోనూ యాక్ట్ చేస్తుంది. రాజ్ కుమార్ రావు హీరోగా తెరకెక్కుతున్న 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' సినిమాల్లో నటిస్తోంది.  రాజ్ శాండిల్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కానుంది. అటు ఆనంద్ తివారీ ‘బ్యూడ్ న్యూస్’లోనూ చేస్తోంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్, అమ్మీ విర్క్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.



Read Also: కోట్ల విలువైన బంగళా, విలాసవంతమైన కార్లు- ‘యానిమల్’ బ్యూటీ నికర ఆస్తుల విలువెంతో తెలుసా?