Trinayani Actor Chandu Wife Shilpa Khanna Comments: త్రినయని సీరియల్ నటి‌ పవిత్ర జయరామ్‌, నటుడు చందు రిలేషన్‌లో రోజురోజుకు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. త్రినయని సీరియల్‌తో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరికి వేరువేరుగా పెళ్లయిన ఆరేళ్లుగా సహాజీవనం చేస్తున్నారు. మొదట వీరిద్దరు భార్యభర్తలు అంటూ వార్తలు వచ్చాయి. సోషల్‌ మీడియాలోనూ ఇద్దరు కలిసి రీల్స్‌ జయడం, ఈవెంట్స్‌కి జంటగా హాజరవ్వడంతో అంతా వారిద్దరు భార్యభర్తలు అనుకున్నారు. కానీ ఆ తర్వాత వారి అసలు రిలేషన్‌ బయటకు రావడంతో అంతా షాక్‌ అయ్యారు.


పైగా పవిత్ర తన భర్తకు విడాకులు ఇవ్వకుండానే చందుతో రిలేషన్‌లో కొనసాగించిందనేది టాక్. పవిత్ర ఆమె భర్త విడాకులు తీసుకోలేదన్న విషయాన్ని స్వయంగా ఆమె కూతురే వెల్లడించింది. ఇది విని అంతా కంగుతిన్నారు. ఇక తాజాగా చందు భార్య శిల్పా ఖన్నా మరోసారి వారి రిలేషన్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన ఆమె పవిత్ర జయరామ్ చేసినవి తలుచుకుంటుంటే చాలా కోపం వస్తుందని, ఆమె ఉండి ఉంటే నేను ఏం చేసేదాన్నో నాకే తెలియదంటూ అసహనం వ్యక్తం చేసింది. 


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "లాక్‌డౌన్ నుంచి పవిత్ర, చందు మధ్య పరిచయం ఎక్కువైంది. అంతకు ముందు కూడా పరిచయమే. కానీ, నార్మల్‌ స్నేహితుల్లా ఉండేవారు. పవిత్ర నాతో కూడా ఫోన్లో మాట్లాడేది. కానీ వారి మధ్య ఇంత పరిచయం పెరుగుతుందని నేను ఊహించలేదు. అసలు చందుతో రిలేషన్‌ కోరుకుందే పవిత్ర. తనతో రిలేషన్‌లో లేకుండా చేయి కోసుకుంటానని బెదిరించింది. తను చేయి కూడా కట్‌ చేసుకుంది. పాత ఫోటోలు వీడియోలు చూస్తే ఆమె చేయిపై మీకు ఘాటు కూడా కనిపిస్తుంది. దాంతో తనతో పరిచయం పెరిగి వివాహేతర సంబంధం వరకు వెళ్లింది" అంటూ చందు భార్య షాకింగ్‌ కామెంట్స్ చేసింది. 


Also Read: మా అమ్మనాన్న విడాకులు తీసుకోలేదు - సంచలన విషయాలు బయటపెట్టిన పవిత్ర జయరామ్‌ కూతురు, భర్త ఎమోషనల్‌


పవిత్రకు నా భర్త కంటే ముందే మరో వ్యక్తితో కూడా సంబంధం ఉంది. తను చందుతో ఎలా ఉండేదో అతడితో కూడా అంతే క్లోజ్‌గా ఉండేది. అతడితో బ్రేకప్‌ తర్వాతే నా భర్తను తగులుకుంది. తన ఓల్డ్‌ ఫోటోస్ చూడండి. తన ఏడమ చేతిపై పెద్దగా ఒక టాటూ ఉంటుంది. హరి అని ఉంటుంది. అతడి పేరు హరినాథ్‌. అతడి చాలా క్లోజ్‌ ఉండేది. అతడిదో ఎంత క్లోజ్‌గా ఉండేదో.. నా భర్త చందుతో కూడా అంతే క్లోజ్‌ ఉంది" అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత పవిత్ర వల్ల పదకొండేళ్ల మా ప్రేమ, వైవాహిక జీవితంలో కలతలు వచ్చాయి. పిల్లలను చూసేందుకు వస్తే కూడా పవిత్ర రానిచ్చేది కాదు. ఇంటికి వస్తే చాలు వెంట వెంటనే ఫోన్లు చేసేది. అలా నా భర్తను పూర్తిగా లొంగబరుచుకుంది. నాలుగేళ్లు నుంచి ఆయన ఇంటికి రావడమే మానేశారు" అంటూ శిల్పా కన్నా కన్నీరు పెట్టుకుంది. నా ఫ్యామిలీ మొత్తాన్ని పవిత్ర నాశనం చేసింది, నమ్మించి మోసం ఈ పరిస్థితుల్లో ఆమె కనుక బతికుంటే నేను ఏం చేసేదాన్నో నాకే తెలియదు అంటూ చందు భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది.