Samantha Recent Instagram Post: గత కొంత కాలంగా సీనియర్ హీరో సమంత.. సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేదు. కానీ సోషల్ మీడయాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది సామ్. తను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఏం తింటుంది లాంటి విషయాలను ఫాలోవర్స్‌తో పంచుకోవడంలో ఈ భామ ఎప్పుడూ ముందుంటుంది. అంతే కాకుండా తన ఫాలోవర్స్‌కు మోటివేషన్ ఇవ్వడం కోసం అప్పుడప్పుడు కొన్ని మోటివేషన్ కోట్స్‌ను కూడా షేర్ చేస్తుంటుంది. తాజాగా సమంత షేర్ చేసిన ఒక కోట్.. నెటిజన్లలో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.


ఫ్యాన్స్‌కు మోటివేషన్...


‘నువ్వు గెలవడం నేను చూడాలనుకుంటున్నాను’ అంటూ ఒక కోట్‌ను షేర్ చేసింది సమంత. ఎవరు గెలవడం చూడాలనుకుంటుంది అని ముందు, వెనుక ఏమీ యాడ్ చేయలేదు. కానీ క్యాప్షన్‌లో మాత్రం ‘నీ మనసులోని ఏవైనా, నీ ఆకాంక్షలు ఏమైనా, నీ రాత మారాలని చూస్తున్నాను. నీకు విజయం పొందే అర్హత ఉంది’ అని చెప్పుకొచ్చింది. అయితే సమంత చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అసలు ఎవరిని ఉద్దేశించి చెప్పింది అని ఫాలోవర్స్‌లో చర్చలు మొదలయ్యాయి. కొందరు మాత్రం ఇది తన ఫ్యాన్స్‌ను మోటివేట్ చేయడానికి చెప్పిందని అంటుంటే మరికొందరు మాత్రం వేరే యాంగిల్‌లో ఆలోచిస్తున్నారు.






ఐపీఎల్ ఫీవర్..


ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఊహించని ట్విస్టులతో దాదాపు సెమీ ఫైనల్స్ వరకు చేరుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) టీమ్. పాయింట్స్ టేబుల్‌లో చివర్లో ఉండి బ్యాక్ టు బ్యాక్ ఓటమిని చవిచూసిన ఆర్సీబీ.. అనూహ్యంగా బ్యాక్ టు బ్యాక్ గెలుపుతో ప్లే ఆఫ్స్ వరకు వచ్చేసింది. మే 22న క్వాలిఫయర్ 1లో ఆడడానికి సిద్ధమయ్యింది. ఈ సందర్భంగా ఆర్సీబీ గెలవాలనే ఉద్దేశ్యంతో సమంత.. ఈ పోస్ట్ షేర్ చేసిందా అని కొందరు కల్ట్ ఆర్సీబీ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఆర్సీబీ టీమ్ తరపున థ్యాంక్స్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.



విరాట్ కోహ్లీ అంటే ఇష్టం..


గతేడాది స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో సమంత పాల్గొంది. ఆ సందర్భంలో తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అని అడగగా.. విరాట్ కోహ్లీ అని చెప్పింది సామ్. అది గుర్తుచేస్తూ ఫ్యాన్స్ అంతా సమంత కూడా ఆర్సీబీ గెలవాలని కోరుకుంటుంది అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే క్లాలిఫయర్ జరుగుతున్న రోజే ఇలాంటి పోస్ట్‌ను షేర్ చేసిందంటూ అంచనాలకు వచ్చేస్తున్నారు. ‘‘విరాట్ కోహ్లీ చాలా ఇన్‌స్పైరింగ్. తన డెడికేషన్, కమిట్మెంట్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. తను కమ్ బ్యాక్ ఇచ్చి సెంచరీ చేసినప్పుడు నేను ఏడ్చినంత పనిచేశాను’’ అని ఆ ఇంటర్వ్యూలో సమంత చెప్పుకొచ్చింది.


Also Read: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ క్యారవాన్‌కు వచ్చి అలా చేశాడు - చాలా భయపడ్డాను, కాజల్‌కు చేదు అనుభవం..