Anant Ambani and Radhika Merchant are gearing up for second pre wedding bash: రెండు నెలల క్రితం జామ్ నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు... వీరి ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించిన ఏదో ఒక వీడియో కనిపిస్తూ ఉండేది. అయితే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇక అయిపోయాయి. తర్వాత పెళ్లే అనుకోకండి... మరో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కోసం ఈ జంట ప్లాన్ చేస్తుందట. నెటిజన్లు ఆశ్చర్యపోయే రేంజ్‌లో మరో ప్రీ వెడ్డింగ్ బ్యాష్‌ను ప్లాన్ చేస్తున్నారట ముకేశ్ అంబానీ, నీతా అంబానీ. జామ్ నగర్‌లో జరిగిన ఈవెంట్‌లో 1200 మంది గెస్టులు రాగా... ఈసారి గెస్టుల సంఖ్య చాలా వరకు తగ్గిస్తున్నట్టుగా తెలుస్తోంది.
నీటిలో మూడు రోజుల పాటు!
బిజినెస్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న కథనాల ప్రకారం... అనంత అంబానీ, రాధిక మర్చంట్‌ల సెకండ్ ప్రీ వెడ్డింగ్ బ్యాష్‌కు డేట్స్ ఫిక్స్ అయ్యాయి. మే 28 నుండి 30 మధ్యలో ఈ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. మొదటి ఈవెంట్‌ను అనంత్ అంబానీ యానిమల్ రెస్క్యూ సెంటర్ అయిన ‘వంతార’లో ఏర్పాటు చేశారు. కానీ ఈసారి నేలపై కూడా కాకుండా ఏకంగా నీటిపైనే ప్రీ వెడ్డింగ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. దాని కోసం లగ్జరీ క్రూజ్ కూడా బుక్ చేసినట్టు తెలుస్తోంది. 800 గెస్టులతో ఏర్పాటు చేసే ఈ ఈవెంట్ కోసం ఇటలీ నుండి సౌత్ ఫ్రాన్స్‌కు ప్రయాణించే లగ్జరీ క్రూజ్‌ను బుక్ చేసిందట అంబానీ కుటుంబం. మూడు రోజుల పాటు ఈ క్రూజ్ మొత్తంగా 4,380 కిలోమీటర్ల ప్రయాణం చేయనున్నట్టు తెలుస్తోంది.
బాలీవుడ్ సెలబ్రిటీలు..
మొదటి ప్రీ వెడ్డింగ్ బ్యాష్‌లాగానే రెండో ప్రీ వెడ్డింగ్ కోసం కూడా కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలను గెస్ట్ లిస్ట్‌లో యాడ్ చేసింది అంబానీ కుటుంబం. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్‌తో పాటు రణబీర్ కపూర్, ఆలియా జంట కూడా ఈ ఈవెంట్‌లో పాల్గోనుంది. 800 గెస్టులు సౌకర్యంగా ఉండడం కోసం 600 మంది క్రూజ్ స్టాఫ్‌ను ఏర్పాటు చేశారట. ప్రస్తుతం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల క్రూజ్ ప్రీ వెడ్డింగ్ బ్యాష్ గురించి బిజినెస్ సర్కిల్స్‌లో మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో కూడా వైరల్ అవుతోంది. కానీ అంబానీ ఫ్యామిలీ మాత్రం దీని గురించి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. దీని వెనుక ఒక కారణం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
నో ఫోన్ పాలసీ..
జామ్ నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించి ఎన్నో వీడియోలు బయటికొచ్చి సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. కానీ ఈసారి క్రూజ్ ఈవెంట్ నుండి మాత్రం అలాంటిది ఏదీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారట ముకేశ్ అంబానీ. అందుకే నో ఫోన్ పాలసీని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 300 వీఐపీ గెస్టులు ఈ క్రూజ్ పార్టీలో భాగం కానున్నారు. ఇప్పటికే ఈ క్రూజ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ఏర్పాట్ల కోసం అంబానీ ఫ్యామిలీ.. లండన్ బయల్దేరినట్టు తెలుస్తోంది. ఇక అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లకు సంబంధించిన ఈ సెకండ్ ప్రీ వెడ్డింగ్ బ్యాష్ ఏ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read: Chat Gpt లో స్కార్లెట్ జాన్సన్ వాయిస్ – షాక్ తిన్న స్టార్ హీరోయిన్ కీలక నిర్ణయం