'సలార్' ట్రైలర్ కి టైమ్ ఫిక్స్ - రాబోయే అప్డేట్స్ పై మేకర్స్ సాలిడ్ అనౌన్స్ మెంట్!


పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్' టీజర్ కి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రావడంతో దీనిపై చిత్ర యూనిట్ తాజాగా స్పందిస్తూ ఓ స్పెషల్ నోట్ ని విడుదల చేసింది. ఈ క్రమంలోనే 'సలార్' టీజర్ ని మించి ట్రైలర్ ఉండబోతుందని ప్రకటించింది. జులై 6, గురువారం విడుదలైన సలార్ టీజర్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ రాబట్టి సరికొత్త ప్రభంజనం సృష్టించింది. హైయెస్ట్ వ్యూస్ సాధించిన ఇండియన్ టీజర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక టీజర్ తో సినిమాపై ఉన్న అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఈ టీజర్ కి అమేజింగ్ రెస్పాన్స్ రావడంతో మూవీ టీం ఆనందంలో మునిగితేలుతూ 'సలార్' ట్రైలర్ ని ఆగస్టులో రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా విడుదల చేసిన స్పెషల్ నోట్లో వెల్లడించింది (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).


తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టే కొడుకు వైఎస్ జగన్ - అదే 'యాత్ర 2'


వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన సినిమా 'యాత్ర'. వైయస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించారు. ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టడానికి ముందుకు రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ఆ సినిమా తీశారు. ఈ రోజు ఆయన జయంతి. ఈ సందర్భంగా 'యాత్ర 2' మోషన్ పోస్టర్ (Yatra 2 Motion Poster) విడుదల చేశారు. 'యాత్ర 2'లో 2009 నుంచి 2019 వరకు జగన్ మోహన్ రెడ్డి జీవిత, రాజకీయ ప్రయాణాన్ని చూపిస్తానని, ఆయన ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని 'యాత్ర 2' మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ తెలిపారు (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి). 


ఎట్టకేలకు సారీ చెప్పిన 'ఆదిపురుష్' రైటర్ - సెటైర్లు వేస్తున్న నెటిజనులు


'ఆదిపురుష్' విడుదలైన తర్వాత... పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వీరాభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి ఆట నుంచి సినిమాపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సినిమాలో డైలాగుల పట్ల సాధారణ ప్రేక్షకులు, ముఖ్యంగా భక్తులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు గాయపరిచేలా సినిమా తెరకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత తమ చర్యలను సమర్ధించుకున్న 'ఆదిపురుష్' చిత్ర రచయిత మనోజ్ ముంతాషిర్, ఎట్టకేలకు క్షమాపణలు కోరారు (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).


మనల్ని ఆపే మగాడు ఎవడు 'బ్రో' - పవన్ సినిమాలో ఫస్ట్ పాట


'మనల్ని ఎవడ్రా ఆపేది?' - జనసేన పార్టీ అధినేతగా, రాజకీయ కోణంలో పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) చెప్పిన మాట. ఇప్పుడీ మాటను ఓ పాటలోకి తీసుకు వచ్చారు రామ జోగయ్య శాస్త్రి. 'బ్రో' సినిమాలోని మొదటి పాటను ఆ మాట గుర్తు వచ్చేలా రాశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించిన చిత్రం 'బ్రో'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. సముద్రఖని రచయిత, దర్శకుడు. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో మొదటి పాటను ఈ రోజు విడుదల చేశారు (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).


విజయ్ దేవరకొండను అమెరికా తీసుకు వెళుతున్న 'దిల్' రాజు, పరశురామ్!


రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా రూపొందుతోంది. ఆ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'గీత గోవిందం' తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కలయికలో వస్తున్న చిత్రమిది. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆల్రెడీ లొకేషన్స్ రెక్కీ కూడా పూర్తి అయ్యింది (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial