Heroine Sharanya Nag: ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తు పట్టారా? 2006లో వచ్చిన టెన్త్ క్లాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఈమె పరిచయం. ఆ సినిమాలో స్కూలు విద్యార్థిని పాత్రలో అమాయకంగా నటించి మెప్పించింది. అనంతరం తెలుగుతో పాటు తమిళ పరిశ్రమలో కూడా చాలా సినిమాల్లో నటించింది. తమిళనాడుకు చెందిన శరణ్య ఇప్పుడు సడెన్‌గా తిరుత్తణిలో ఇలా కనిపించి అందర్నీ ఆశ్చర్యపర్చింది.


గుండు చేయించుకొని ఆలయానికి వచ్చిన శరణ్య గుడి బయటే పూజలు చేసి.. తన నాలుకపై శూలం దింపించుకొన్నారు. అక్కడి నుంచి మొక్కుతో బోనం ఎత్తుకొని.. తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు తలనీలాలు కూడా సమర్పించారు. 


2014 నుంచే ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ.. తాజాగా తమిళనాడులోని తిరుత్తణి దేవాలయంలో ఇలా కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.


1998లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కాదల్ కవితై అనే తమిళ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది శరణ్య నాగ్. తర్వాత నీ మనసు నాకు తెలుసు సినిమాలో హీరోయిన్ కు ఫ్రెండ్ గా నటించింది. 2006లో టెన్త్ క్లాస్ సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. తర్వాత 2013లో ప్రేమ ఒక మైకం, దూసుకెళ్తా సినిమాల్లో తెలుగు సినిమాల్లో నటించింది. తమిళంలో దాదాపు 15 సినిమాల్లో నటించి 2014 నుంచి పూర్తిగా సినిమాలకు దూరమైంది.