Naveen Polishetty Injured in Bike Accident: యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి ప్రమాదాని గురయ్యాడు. ప్రస్తుతం ఆమెరికాలో ఉన్న నవీన్‌ రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైనట్టు సమాచారం. బైక్‌పై వెళ్తుండగా స్కిడ్ అవ్వడంతో అతడు జారిపడటంతో తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నవీన్‌ చేతికి బలమైన గాయమైందని, చేయి ఫ్యాక్చర్ అయ్యిందని చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం నవీన్‌ అమెరికాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌.


కాగా నవీన్‌కి దాదాపు రెండు నెలలు వరకు విశ్రాంతి అవసరం అవుతుందని వైద్యులు సూచించినట్టు సిన్నిహితవర్గాల నుంచి సమాచారం. అయితే నవీన్‌ ఆరోగ్యంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అలాగే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై ఇంకా మాత్రం క్లారిటీ లేదు. అంతేకాదు ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటన జరిగి రెండ్రోజులు అవుతోంది అంటున్నారు.



Also Read: ఓ మై గాడ్‌.. మీకు ఫుల్‌గా పడిపోయానండి బాబూ! - అంచనాలు పెంచేస్తున్న ఫ్యామిలీ స్టార్‌ ట్రైలర్‌ 


కాగా గతేడాది నవీన్‌ 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి' చిత్రంతో అలరించాడు. ఇందులో అతడు అనుష్క శెట్టికి జతగా నటించాడు. ఇందులో స్టాండప్‌ కమెడియన్‌గా తన పాత్రతో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ విజయం సాధించింది. ఇక అంతకు ముందు 'జాతిరత్నాలు' చిత్రంతో నవ్వించాడు ఈ పోలిశెట్టి.  లైఫ్ ఈజ్‌ బ్యూటీఫుల్‌ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన నవీన్‌ పోలిశెట్టి 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి వైవిధ్యమైన కథ, డిఫరెంట్‌ రోల్స్‌ ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. చివరిగా మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టిలో నటించిన నవీన్‌ ఆ తర్వాత రెండు సినిమాలకు సంతకం చేశాడు, ఒకటి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లో ఒక సినిమా, షైన్‌ సర్కీన్స్‌ బ్యానర్లో మరో సినిమాకు కమిట్‌ అయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.