Tillu Square Box Office Collection Day 2: ఒక సినిమా హిట్ అయినా అవ్వకపోయినా.. దానికి సీక్వెల్‌ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఫ్లాప్ అయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కించడం కంటే హిట్ అయిన సినిమా సీక్వెల్‌తో ప్రేక్షకులను మెప్పించడమే కష్టం. కానీ ‘టిల్లు స్క్వేర్’ మాత్రం ఇందులో పూర్తిగా సక్సెస్ అయ్యింది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’కు రోజురోజుకీ పాజిటివ్ టాక్‌తో పాటు కలెక్షన్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఈ మూవీ ఇదే రేంజ్‌లో రన్ అయితే వెంటనే బ్రేక్ ఈవెన్ కూడా దాటిపోయి లాభాలు రావడం గ్యారెంటీ అంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు.


రెండు తెలుగు రాష్ట్రాల్లో..


‘టిల్లు స్క్వేర్’ మొదటి వీకెండ్ మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ప్రస్తుతం సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే మూడురోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించేలా ఉందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్స్ విషయానికొస్తే.. మొదటిరోజు రూ.9.25 కోట్లు సాధించగా.. రెండోరోజు రూ.7.36 కోట్లను సాధించింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘టిల్లు స్క్వేర్’ రెండు రోజుల కలెక్షన్స్ రూ.16.61 కోట్లని తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ మూవీ గ్రాస్ కలెక్షన్స్ రూ. 25.50 కోట్లని తెలుస్తోంది. ఓవర్సీస్‌లో సైతం ‘టిల్లు స్క్వేర్’కు మంచి ఆదరణ లభిస్తోంది.


బ్రేక్ ఈవెన్‌కు కొంచెం దూరంలో..


ఓవర్సీస్‌లో రెండు రోజుల్లోనే ‘టిల్లు స్క్వేర్’కు రూ.7.10 కోట్ల కలెక్షన్స్ దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో రూ.1.40 కోట్ల కలెక్షన్స్ సాధించినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ‘టిల్లు స్క్వేర్’కు నెట్ కలెక్షన్స్ రూ.25.11 కోట్లు దక్కగా.. గ్రాస్ కలెక్షన్స్ రూ.42.60 కోట్లుగా నిలిచాయి. విడుదలయిన మొదటిరోజు ‘టిల్లు స్క్వేర్’.. ప్రపంచవ్యాప్తంగా రూ.23.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. రెండోరోజు రూ.18.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ మూవీకి రూ.27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ రావాలంటే రూ.28 కోట్లు కావాలి. అంటే ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్‌ను బట్టి చూస్తే.. మరో రూ.2.89 కోట్లతో ‘టిల్లు స్క్వేర్’కు బ్రేక్ ఈవెన్ వచ్చేస్తోంది. థియేటర్లలో ‘టిల్లు స్క్వేర్’ మూవీ ఓ రేంజ్‌లో కలెక్షన్స్ సాధిస్తుండడంతో ఈ విషయాన్ని దర్శకుడు మల్లిక్ రామ్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.






రెండేళ్ల తర్వాత..


2022 ఫిబ్రవరి 12న విడుదలయిన ‘డీజే టిల్లు’ ఓ రేంజ్‌లో సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. సిద్ధు జొన్నలగడ్డకు స్టార్ స్టేటస్‌ను తెచ్చిపెట్టింది. అందుకే ఆ మూవీకి వచ్చిన రెస్పాన్స్ చూసి దానికి సీక్వెల్ తెరకెక్కించాలని మేకర్స్ అప్పుడే నిర్ణయించుకున్నారు. అందుకే ఈ రెండేళ్లు ఇతర ప్రాజెక్ట్స్‌కు కమిట్ అవ్వకుండా ‘టిల్లు స్క్వేర్’పైనే దృష్టిపెట్టాడు సిద్ధు. ఇక ‘డీజే టిల్లు’కు తగిన సీక్వెల్‌ను తెరకెక్కించారని, ఎన్నో అంచనాలతో వచ్చిన ఆడియన్స్ అసలు నిరాశపడరని ‘టిల్లు స్క్వేర్’కు అంతటా పాజిటివ్ రివ్యూలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లిల్లీ పాత్రలో అనుపమ అదరగొట్టేసిందని ప్రశంసిస్తున్నారు ప్రేక్షకులు.


Also Read: ఫుల్ స్వింగ్‌లో ప్రశాంత్ వర్మ - ‘జై హనుమాన్’ క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్!