ఈ వారం బాక్సఫీస్ దగ్గర సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్న సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రామబాణం
మ్యాచో హీరో గోపీచంద్ ,శ్రీవాస్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా ఇది.గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం,లౌక్యం మంచి విజయాలను అందుకోవడంతో.. తాజాగా వస్తున్న రామబాణం సినిమాపై మంచి అంచనాలున్నాయి.ఇప్పటికే విడుదలైన సాంగ్స్,ట్రయిలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల,టిజి విశ్వ ప్రసాద్ నిర్మిచిన ఈ సినిమా కమర్షియల్ ఫ్యామిలీ డ్రామా గా రూపొందింది.ఇక సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటించగా,జగపతి బాబు,ఖుష్బూ,శుభలేఖ సుధాకర్ సచిన్ ఖేడేర్కర్,అలీ,వెన్నెల కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ మూవీ మే 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఉగ్రం
అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల తెరకెక్కించిన సినిమా ఉగ్రం.షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి,హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు.సినిమాలో అల్లరి నరేష్ సరసన మీర్ నా హీరోయిన్ గా నటించింది.గతంలో నరేష్- విజయ్ కాంబినేషన్లో వచ్చిన 'నాంది' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో వీరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది.
అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ పోషించిన ఈ మూవీ మే 5 న విడుదల కానుంది.
ఓటీటీ రిలీజెస్
నెట్ ఫ్లిక్స్
⦿ రమేష్ కాడూరి దర్శకత్వంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'మీటర్' సినిమా మే 5 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
⦿ బాలీవుడ్ హీరో రణబీర్, శ్రద్ధ కపూర్ జంటగా నటించిన 'తూ ఝూతి మే మక్కర్ ' సినిమా మే 5 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
⦿ ‘జ్యూయిష్ మ్యాచ్మేకింగ్’ అనే హాలీవుడ్ సినిమా మే 3 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
⦿ ‘లవ్ విలేజ్’ అనే ఇంగ్లీష్ మూవీ మే 2 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
⦿ క్వీన్ షార్లెట్ : ఏ బ్రిడ్జిర్టోన్ స్టోరీ అనే ఇంగ్లీష్ మూవీ మే 4 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
⦿ హాలీవుడ్ మూవీ ‘ది టైలర్’ సినిమా మే 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
హాట్ స్టార్
⦿ హాలీవుడ్ పాపులర్ స్టార్ వార్స్ ఫ్రాంచైజీ నుండి 'స్టార్ వార్స్: విజన్స్’ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ సంబంధించి సీజన్ 2 మే 5 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
⦿ రెన్నెర్వేషన్స్ అనే ఇంగ్లీష్ మూవీ మే 3న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
⦿ 'కరోనా పేపర్స్' అనే మలయాళ చిత్రం మే 5 న డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
⦿ 'సాస్ బహూ ఔర్ ఫ్లెమింగో' అనే హిందీ వెబ్ సిరీస్ మే 5 న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.