This Week Theatre and OTT Movies: ప్రతివారం కొత్తకొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు థియేటర్లో, ఓటీటీలో సందడి చేస్తుంటాయి. దీంతో మూవీ లవర్స్‌కి డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుంది. అయితే గడిచిన రెండు వారాల్లో థియేటర్లో పెద్ద సినిమాల సందడి లేదనే చెప్పాలి. ఇక మే నెలలో అయితే బిగ్‌స్క్రీన్ వద్ద అన్ని చిన్న సినిమాలే రిలీజ్ అయ్యాయి. దీంతో చాలా రోజులుగా థియేటర్లు డల్‌గా కనిపించాయి. కానీ ఈ వారం మాత్రం స్టార్ హీరో సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. అవే విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'గం గం గణేశా', 'భజే వాయు వేగం' చిత్రాలు విడుదలకు కానున్నాయి. అందులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిపై మంచి బజ్ ఉండగా.. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ప్రిమియర్‌కు రాబోతున్నాయి. దాదాపు 19 వరకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ వచ్చేస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం.
థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు
Gangs Of Godavari: ఈ వారం థియేటర్లోకి మూడు సినిమాలు రాబోతున్నాయి. అవే విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ ఒకటి. మే 31న ఈ సినిమా విడుదల కానుంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పలు వాయిదా అనంతరం ఇప్పుడు చివరిగా మే 31న విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమా రిలీజ్‌కి ఇంకా కొన్ని రోజులే టైం ఉండటంతో మూవీ టీం ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇందులో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది.
Bhaje Vaayu Vegam: RX100 హీరో కార్తీకేయ నటించిన లేటెస్ట్ మూవీ భజే వాయు వేగం. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ మే 31 థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వలో రూపొందుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. హ్యాపీ డేస్ ఫేం రాహుల్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Gam Gam Ganesha: విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గం గం గణేశా'. బేబీ లాంటి భారీ హిట్ తర్వాత ఆనంద్ నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. క్రైమ్ కామెడీ చిత్రంగా వస్తున్న ఈ సినిమా కూడా మే 31 రిలీజ్ కాబోతుంది. ఇందులో అను ఇమాన్యుయెల్ హీరోయిన్.
ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ లు
అమెజాన్ ప్రైమ్
1. పంచాయత్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 28
జియో సినిమా
1. ఇల్లీగల్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 29
2. దేద్ బిగా జమీన్ (హిందీ సినిమా) - మే 31
3. లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ సిరీస్) - మే 31
4. ద లాస్ట్ రైఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31
5. ఏలీన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 01
నెట్‌ఫ్లిక్స్
1. ద లైఫ్ యూ వాంటెడ్ (ఇటాలియన్ సిరీస్) - మే 29
2. ఎరిక్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 30
3. గీక్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 30
4. ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ సినిమా) - మే 31
5. రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ సిరీస్) - మే 31
6. లంబర్‌జాక్ ద మానస్టర్ (జపనీస్ మూవీ) - జూన్ 01
హాట్‌స్టార్
1. కామ్డేన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 29
2. ద ఫస్ట్ ఓమన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 30
3. ఉప్పు పులి కారమ్ (తమిళ సిరీస్) - మే 30
4. జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31