ప్రస్తుతం యువత వాలంటైన్‌ వీక్‌ను సెలబ్రేషన్స్‌లో ఉంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. ఇది ప్రేమికుల పండగా రోజు అన్నమాట. ఈ సందర్భంగా అప్పుడప్పుడే ప్రేమలో పడ్డవారు ఎదుటివారికి తమ ప్రేమను ఎలా వ్యక్తం చేయాలా? అని రకరకాలుగా ప్లాన్‌ చేస్తుంటారు. అల్రెడీ ప్రేమలో ఉన్నవారంత తమ ప్రియమైన వారితో ఇష్టంగా గడిపేందుకు ప్లాన్‌ చేస్తుంటారు. ఇదిలా ఉంటే నిజమైన ప్రేమికు నిదర్శనంగా వెండితెరపైకి చాలా ప్రేమకథలు వచ్చాయి. అవన్ని ఎంతోమంది ప్రేమికులకు స్ఫూర్తిగా ఉంటాయి. లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ సినిమాలు ఎన్నో వచ్చినా.. అందులో కొన్ని మాత్రమే ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. అందులో నాగార్జున గీతాంజలి మొదటి ప్లేస్‌లో ఉంటుంది. మరి ఈ వాలంటైన్‌కి మీ పార్ట్‌నర్‌తో కలిసి చూసే ప్రేమ చిత్రాలెంటో ఇక్కడ చూద్దాం!


నాగార్జున 'గీతాంజలి'


నాగార్జున-మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన 'గీతాంజలి' మూవీ అప్పటి.. ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్‌ అనే చెప్పాలి. అసలు తెలుగు ప్రేమకథ చిత్రాల్లో లిప్‌లాక్‌ సీన్స్‌కు శ్రీకారం చుట్టుందే గీతాంజలి. క్యాన్సర్‌ బారిన పడ్డ హీరోహీరోయిన చివరి రోజులను లెక్క పెట్టుకుంటుండా ఒకరికొరు తారసపడి ప్రేమలో పడటం. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఆ ఇద్దరు ప్రేమలో మునిగిపోతారు. ఈ క్రమంలో హీరోకి కూడా తనలాగాగే క్యాన్సర్‌ మహమ్మారి ఉందని తెలిసి హీరోయిన్‌ తల్లడిల్లే తీరు.. ఆమె వదిలి ఉండలేక హీరో పడే వేదన ప్రతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. ఇలా పవిత్రమైన ప్రేమకు నిదర్శనంగా వచ్చినా గీతాంజలి మూవీ ఈ వాలంటైన్‌కు మీ పార్ట్‌నర్‌తో కలిసి మరోసారి వీక్షించి ప్రేమను ఆస్వాదించండి. 


స్నేహితులను ప్రేమికులుగా మార్చిన 'నువ్వేకావాలి'


ఒకేరోజు పుట్టి.. ఒకే కాలేజ్‌.. ఒకే క్లాస్‌రూం.. ఫ్యామిలీ ఫ్రెండ్సైన కుటుంబంలో పుట్టిన ఇద్దరి స్నేహితుల ప్రేమకథగా వచ్చిన చిత్రమే నువ్వే కావాలి!. ఇలాంటి వారు ఒకే జెండర్‌ అయితే ప్రాణ స్నేహితులు అవుతారు. అదే అమ్మాయి-అబ్బాయి అయితే అంతకుమించిన బాండింగ్‌ ఉంటుంది.ఎప్పుడూ కొట్టుకుంటూ, తిట్టుకుంటూనే వేరువేరుకు ఉండలేని ఈ స్నేహితులు.. ప్రేమికులు ఎలా మారారు. అసలు ఇద్దరు స్నేహితులను ఇలాంటి ప్రేమ ఏంటీ? అని ఎదురయ్యే ప్రశ్నలు..ఈ మధ్య సతమతమయ్యే హీరో.. ఓ క్లాసికల్‌ లవ్‌స్టోరీగా వచ్చిన నువ్వే కావాలి  సినిమా టాలీవుడ్‌ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. మరోసారి ఈ వాలంటైన్‌కు మీ ప్రియమైన వారితో కలిసి ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్‌ చేయండి.


ఇద్దరు ఈగో పర్సన్స్‌ లవ్‌లో పడితే..


కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్‌ అంటూ ఉండదూ. ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో పవన్‌ కళ్యాణ్‌ ‘ఖుషీ’ ఒకటి. అప్పటికే ఐదు బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో జోరుమీదున్న పవన్‌కు ఈ సినిమా డబుల్‌ హ్యట్రిక్‌గా నిలిచింది. లవ్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఇద్దరు ఇగో పర్సన్స్‌ ప్రేమలో పడితే ఎలాంటి ఉంటుందో చూపించాడు ఎస్‌జే సూర్య. ఈ సినిమాలో పవన్‌-భూమిక కెమిస్ట్రీకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. ఎస్‌.జే సూర్య అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక మణిశర్మ స్వర పరిచిన పాటలైతే ఇప్పటికి చెవులలో మార్మోగుతునే ఉన్నాయి.


ప్రేమ కోసం పోరాడిన 'జయం'


 నిరుపేద అబ్బాయి, ఉన్నత కుటుంబానికి చెందిన అమాయితో ప్రేమలో పడతాడు. వారిద్దరి ప్రేమకు కులం, డబ్బు అడ్డు అవుతుంది. తమ ప్రేమను కాపాడుకోవడానికి ఆ ప్రేమికులు చేసిన పోరాటమే ఈ 'జయం' సినిమా. జూన్ 14, 2022న విడుదలైన ఈ మూవీ అప్పట్లో ఓ సంచలనంగా మారింది. చిత్రం, నువ్వు నేను విజయాలతో ఊపుమీదున్న దర్శకుడు తేజా జయం మూవీతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమాతోనే నితిన్‌ హీరోగా పరిచయం అయ్యాడు. సదాను కూడా ఈ చిత్రంతోనే వెండితెరకు పరిచయం చేశాడు తేజ.  


‘7/జీ బృందావన కాలనీ’


ప్రేమ కథా చిత్రాల్లో ‘7/జీ బృందావన కాలనీ’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సెల్వరాఘన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ యూత్‍ను తెగ ఆకట్టుకుంది. 2004లో 7/జీ రెయిన్‍బో కాలనీ పేరుతో తమిళంలో రిలీజ్ అయిన ఈ సినిమా.. అదే ఏడాది తెలుగులో ‘7/జీ బృందావన కాలనీ’ పేరుతో వచ్చింది. తెలుగులోనూ ఈ సినిమా భారీ హిట్ సాధించింది. కల్ట్ క్లాసిక్‍గా నిలిచింది. చనిపోయిన ప్రియురాలి జ్ఞాపకాల్లోనే ఉండిపోయిన ఈ ప్రేమకుడి కథ ఇది. చనిపోయినా కూడా ఆమె అతడితోనే ఉన్నట్టుగా ఫీల్‌ అవుతాడు. 



జౌను వాళ్లీద్దరు ఇష్టపడ్డారు


చూసుకొకుండానే ప్రేమించుకున్న ప్రేమికుల కథ ఇది. ఒకే రూంను వారిద్దరు షేర్‌ చేసుకోవడం.. డే టైంలో హీరో, రాత్రి సమయంలో హీరోయిన్‌ ఉంటూ చూసుకోకుండానే ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకోవడం.. ఆ తర్వాత ప్రేమలో పడటం.. ఇలా డిఫరెంట్‌గా ప్రేమకథగా వచ్చింది ఈ సినిమా. ఇందులో రవితేజ-కళ్యాణిలు హీరోహీరోయిన్‌గా నటించారు. 


సీతారామం 


ఇటీవల వచ్చిన ఈ సినిమాను మూవీ లవర్స్‌ ఎవరూ మర్చిపోరు. రీసెంట్ టైంలో వచ్చిన ఓ ప్యూర్‌ లవ్‌స్టోరి ఇది. యువరాణి అనాథయిన ఓ సైనికుడి ప్రేమలో పడటం.. అతడి కోసం ఆమె తన ప్యాలేస్‌.. ఆస్తులను వదిలి వచ్చేసింది. ఇక ఇద్దరు కలిశారని సంతోషించేలోపు హీరో ఓ ఆపరేషన్‌ పేరుతో పాకిస్తాన్‌ వెళ్లి.. అక్కడి ఆర్మీకి చిక్కుతాడు. ఆ తర్వాత మరణిస్తాడు. ఆ విషయం తెలియని ప్రియురాలు 20 ఏళ్లుగా అతడి కోసం ఎదురుచూస్తుంది. లవ్‌ అండ్‌ ఎమోషన్స్‌తో వచ్చిన ఈ సినిమా కల్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యాడు. ఈ చిత్రంతోనే మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రమే ఆమెను స్టార్‌ చేసింది.