Ranbir Kapoor : ఎంత బ్లాక్‌బస్టర్ సినిమాను అయినా విమర్శించే క్రిటిక్స్ ఉంటారు. సినిమా అనేది కేవలం ఎంటర్‌టైన్మెంట్ కోసం తెరకెక్కించింది అన్నట్టుగా కాకుండా దాని వల్ల చూసే ఆడియన్స్ ప్రభావితం అవుతారని వాగ్వాదం చేసేవారు కూడా ఉంటారు. అందుకే మేకర్స్.. ఎన్నో రూల్స్ మధ్య తమ సినిమాలను తెరకెక్కించాల్సి ఉంటుంది. కొందరు మేకర్స్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నా సినిమా.. నా ఇష్టం అన్నట్టుగా ఉంటారు. అందులో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరు. తాజాగా తను తెరకెక్కించిన ‘యానిమల్’ గురించి ప్రేక్షకులంతా మాట్లాడుకుంటూ ఉండగా.. ఇందులోని పలు సీన్స్ మాత్రం కాంట్రవర్సీలకు, చర్చలకు దారితీశాయి.
తృప్తి పాత్రే కాంట్రవర్సీలకు కారణం..
రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమా ఎలా ఉంటుందో దర్శకుడు ముందు నుండే హింట్స్ ఇస్తూ వస్తున్నాడు. పైగా గ్లింప్స్ నుంచే ఇదొక వైలెంట్ సినిమా అని, రణబీర్‌ది ఒక వెలెంట్ క్యారెక్టర్ అని ప్రేక్షకులకు అర్థమయ్యింది. ఇక మూవీ విడుదలయిన తర్వాత రణబీర్ క్యారెక్టర్ గురించి, పలు సీన్స్ గురించి చర్చలు మొదలయ్యాయి. ముందుగా ఈ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన తృప్తి దిమ్రీతో రణబీర్ కపూర్ రొమాన్స్ అనేది కాస్త శృతిమించిపోయి ఉందని క్రిటిక్స్ విమర్శలు వినిపిస్తున్నారు. అంతే కాకుండా తృప్తి పాత్ర తనను ప్రేమిస్తుంది అని చెప్పిన తర్వాత ఆ ప్రేమను నిరూపించుకోవడానికి రణబీర్ కపూర్.. తన షూను నాకమంటాడు. అన్నింటికంటే ఎక్కువగా ఈ సీన్.. ప్రేక్షకుల్లో చర్చకు కారణమయ్యింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం తాను అందించిన రివ్యూలో ఈ సీన్ తనకు నచ్చలేదని చెప్పాడు.
కాలేజ్‌లోకి గన్..
ఇక ‘యానిమల్’లో చర్చనీయంశంగా మారిన మరొక సీన్ - రణబీర్ కపూర్.. కాలేజ్‌లోకి గన్ తీసుకొని రావడం. రణబీర్ కపూర్.. తన అక్కను ర్యాగింగ్ చేసినవారికి గుణపాఠం చెప్పాలని కాలేజ్‌లోకి గన్ తీసుకొచ్చి బెదిరిస్తాడు. మామూలుగా చిన్నపిల్లలు సినిమాలు చూసి ఎక్కువగా ప్రభావితం అవుతారని, అలాంటప్పుడు సినిమాల్లో ఇలాంటి సీన్స్ పెట్టడం మంచిది కాదని సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది. ఇక రష్మికతో రణబీర్ సీన్స్, డైలాగ్స్ కూడా చాలావరకు కాంట్రవర్సీలను క్రియేట్ చేసేలాగానే ఉన్నాయి. ముఖ్యంగా రష్మికతో ప్యాడ్ చేంజ్ గురించి రణబీర్ మాట్లాడడం చాలామంది మహిళా ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించింది.
ప్యాడ్స్, పెల్వీస్.. ఏంటో ఈ డైలాగులు..!
‘‘నువ్వు నెలకు నాలుగు ప్యాడ్స్ మార్చుకుంటూ కంప్లయింట్ చేస్తున్నావు. నేను రోజుకు 50 మార్చుకుంటున్నాను’’ అని రణబీర్ కపూర్ చెప్పిన డైలాగ్.. ఆడియన్స్‌ను ఇబ్బందికి గురిచేసింది. రణబీర్.. తన క్యారెక్టర్ ఉన్న పరిస్థితిని చెప్పడం కోసం ఈ డైలాగ్‌ను ఉపయోగించినా.. ఇలాంటి డైలాగ్ సినిమాలో ఉండకుండా ఉండాల్సింది అని చాలామంది భావించారు. ఇక రష్మికకు పెద్ద పెల్వీస్ ఉందని రణబీర్ చెప్పిన డైలాగ్ కూడా తెగ వైరల్ అయ్యింది. డైలాగుల విషయంలోనే కాదు.. యాక్టింగ్ విషయంలో కూడా రణబీర్ కపూర్ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌లాగా మారిపోయాడు. సినిమాలో తన హార్ట్ సర్జరీ తర్వాత తాను బాగానే ఉన్నానని అందరికీ నిరూపించడం కోసం రణబీర్ పూర్తిగా న్యూడ్‌గా కనిపించాడు. ఒక పెద్ద యాక్టర్ అయ్యిండి ఇలాంటి సీన్ చేయడానికి ధైర్యం కావాలని కొందరు ప్రేక్షకులు అంటుంటే.. అసలు ఆ సీనే అనవసరం అని మరికొందరు భావిస్తున్నారు.
Also Read: మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో - రామ్ చరణ్‌తో దోస్తీ భేటీ