Bhushan Kumar About The Raja Saab Movie: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజా సాబ్’. హారర్ కామెడీ జానర్ లో పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నది. తాజాగా ఈ సినిమా గురించి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, టీ- సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమా హాలీవుడ్ మూవీన ‘హ్యారీ పోటర్’ను తలపించేలా ఉందన్నారు. “ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ రైట్స్ మేం తీసుకున్నాం. ఈ సినిమాలో కొన్ని సీన్స్ నేను చూశాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. హాలీవుడ్ మూవీ ‘హ్యారీ పోటర్’ను తలపించేలా ఉన్నాయి” అని చెప్పుకొచ్చారు. భూషణ్ కుమార్ కామెంట్స్ తో హిందీ బెల్ట్ లో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
‘స్పిరిట్’ గురించి కీలక వ్యాఖ్యలు
అటు సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీ గురించి భూషణ్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమా కోసం ఆసక్తికగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. “ఈ మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. డిసెంబర్ లో లాంఛనంగా ప్రారంభిస్తాయి. ఇది చాలా పెద్ద సినిమా. పోలీసు స్టోరీ నేపథ్యంలో కొనసాగుతుంది. ప్రభాస్ పోలీసు అధికారిగా కనిపిస్తారు. ప్రముఖ నటీనటులు ఇందులో భాగం అవుతున్నారు. వారి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. ఈ సినిమా కోసం ప్రభాస్ తో పాటు మేం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అని చెప్పుకొచ్చారు. ‘స్పిరిట్’ సినిమాను టీ-సిరీస్ నిర్మిస్తున్నది. 2026లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
రెండేళ్ల క్రితమే ‘ది రాజా సాబ్’ ప్రారంభం
అటు ‘ది రాజా సాబ్’ సినిమాకు సంబంధించి నిర్మాత టీ. జీ విశ్వ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఈ సినిమా పనులు రెండు సంవత్సరాల క్రితమే ప్రారంభం అయ్యాయన్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు చెప్పారు. “ఈ సినిమా రెండు సంవత్సరాల క్రితమే ప్రారంభం అయ్యింది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెడుతున్నాం. ఇప్పటి వరకు ఇండియన్ వెండితెరపై చూడని ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు” అని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలతో ఈ సినిమాపై ఆడియెన్స్ లో మరింత క్యూరియాసిటీ పెరుగుతోంది. కచ్చితంగా సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం ఉందని సినీ లవర్స్ భావిస్తున్నారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల
‘ది రాజా సాబ్’ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10, 2025న ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Also: ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’- దుమ్మురేపుతున్న టామ్ క్రూజ్ టీజర్ ట్రైలర్!