Srikanth Odela: గోదావరిఖనిని వదిలి పెట్టని ఓదెల... నానితో 'ది ప్యారడైజ్' చేస్తూనే మరోవైపు ‘గులాబీ’తో గురి
Al Amina Zariya Ruksana's Gulabi movie: ది ప్యారడైజ్ దర్శకుడు సాహసం చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకున్న శ్రీకాంత్ ఓదెల, ఇప్పుడు కెరీర్‌లో మరో ముందడుగు వేశారు.

Srikanth Odela Turns Producer: ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న శ్రీకాంత్ ఓదెల.. ఇప్పుడు మరోసారి నానితో ‘ది ప్యారడైజ్’ అంటూ అందరినీ సర్‌ప్రైజ్ చేయబోతున్నారు. సర్‌ప్రైజ్ ఎందుకు అని అనాల్సి వచ్చిందో.. ఇటీవల వచ్చిన ‘రా స్టేట్‌మెంట్’ చూస్తే తెలుస్తుంది. ఎవరూ ఊహించని విధంగా నేచురల్ స్టార్ నానిని చూపిస్తూ.. ‘దసరా’కు మించిన రా అండ్ రస్టిక్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడనే హింట్‌ని ఆ సినిమాతో ఇచ్చేశాడు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా కూడా ఓ వైవిధ్యభరితంగా ఉండబోతుందనే హింట్‌ని రక్తం సాక్షిగా అనౌన్స్ చేశారు. అంతే, శ్రీకాంత్ ఓదెల పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారిగా ట్రెండ్‌లోకి వచ్చేసింది. ఇవి ఆయన దర్శకత్వం వహించే చిత్రాలు.. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల మరో సాహసం చేస్తున్నాడు. అదీ కూడా తనకి అచ్చి వచ్చిన గోదావరిఖనిని నమ్ముకునే కావడం విశేషం. అసలు విషయంలోకి వస్తే..
మూడే మూడు చిత్రాలు, అందులో ఒకటి విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌తో పాటు అనేక అవార్డులను అందుకుంది. రెండోది సెట్స్‌పై ఉంది. మూడోది ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది. అయినా కూడా ఈ మధ్య స్టార్ దర్శకులు ఎలా అయితే నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారో.. అలానే ఈ కుర్ర దర్శకుడు కూడా నిర్మాతగా మారి ఓ సినిమాను నిర్మిస్తున్నారు. సమ్మక్క సారక్క క్రియేషన్స్ బ్యానర్ స్థాపించిన శ్రీకాంత్.. చేతన్ బండిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ‘అల్ అమీనా జరియా రుక్సానాస్ గులాబీ’ పేరుతో ఓ అత్యద్భుతమైన ప్రేమకథను రూపొందించబోతున్నారు. సమ్మక్క సారక్క క్రియేషన్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథను కూడా శ్రీకాంత్ ఓదెలనే సమకూర్చారు.
Also Read: 'బాలీవుడ్ నా మీద కుట్రలు పన్నింది' - ఇండస్ట్రీలోనే లేకుండా చేయాలని చూశారన్న నటుడు గోవిందా
2009లో గోదావరిఖని బొగ్గు పట్టణంలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా ఈ ప్రేమకథను శ్రీకాంత్ రెడీ చేశాడని తెలుస్తుంది. ఒక అబ్బాయితో ప్రేమలో ఉన్న అమ్మాయి యొక్క ఎమోషనల్ లవ్ స్టోరీ ఇదని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని చిత్రయూనిట్ ప్రకటించింది. అలాగే, ఈ చిత్రంలో నటించే నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలను కూడా మరో అప్డేట్‌లో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం అనౌన్స్‌మెంట్ పేరుతో విడుదల చేసిన ఈ పోస్టర్ మాత్రం వైరల్ అవుతోంది.
‘అల్ అమీనా జరియా రుక్సానాస్ గులాబీ’ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని గమనిస్తే.. ‘కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే’ పాటలోని మనీషా కొయిరాలాను గుర్తు చేస్తుంది. పోస్టర్‌లో నల్ల చీర ధరించిన అమ్మాయి సరిహద్దు వెంబడి నడుస్తూ, ఎర్ర గులాబీలు అక్కడక్కడా చెల్లాచెదురుగా ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ టైటిల్ అలాగే ఆకర్షణీయమైన పోస్టర్స్ కలయిక ప్రేక్షకులకు సినిమా గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని కలగజేస్తుంది. మొత్తంగా అయితే, కొన్ని రోజుల్లో ఎక్కడ విన్నా శ్రీకాంత్ ఓదెల పేరే వినబడుతుందనే దానికి సూచనలా ఈ ప్రయత్నం ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చూద్దాం.. ఈ కుర్ర హీరో ఫ్యూచర్ ఎలా డిసైడ్ అయి ఉందో..