Thandel Piracy: 'తండేల్'ను వదలని పైరసీ భూతం... ఏపీ ఆర్టీసీ బస్సులో మరోసారి... ఆధారాలతో కంప్లయింట్ ఇచ్చిన నిర్మాత

Thandel : రెండవసారి ఆర్టీసీ బస్సులో 'తండేల్' మూవీ పైరేటెడ్ వెర్షన్ ను ప్లే చేశారు. ఇదే విషయాన్ని నిర్మాత బన్నీ వాసు ఈసారి ప్రూఫ్స్ తో సహా ఆర్టీసీ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.

Continues below advertisement

'తండేల్' మూవీకి పట్టిన పైరసీ భూతం ఇంకా వదలట్లేదు. ఇప్పటికే మేకర్స్ అఫీషియల్‌గా పైరసీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఈ మూవీని బస్సులో ప్రదర్శించిన వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. అయినప్పటికీ కొందరు పైరసీ రాయుళ్ళు ఏమాత్రం వెనకంజ వెయ్యట్లేదు. మరోసారి 'తండేల్' మూవీని బస్సులో ప్రదర్శించారంటూ నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు.

Continues below advertisement

ఏపీ ఆర్టీసీ బస్సులో మరోసారి 'తండేల్' పైరసీ ప్రింట్
''ఇప్పటికే ఒకసారి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో పైరేటెడ్ వెర్షన్ 'తండేల్' మూవీని ప్రదర్శించారు'' అంటూ నిర్మాత 'బన్నీ' వాసు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీనికి సంబంధించిన విచారణ జరుగుతుండగానే, మరోవైపు సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఈసారి వీడియో, ప్రూఫ్స్ తో సహా బన్నీ వాసు ఈ విషయంపై కంప్లైంట్ చేశారు. "మరోసారి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో 'తండేల్' పైరేటెడ్ వెర్షన్ ను ప్లే చేశారు. పైరసీ ఫిల్మ్ ఇండస్ట్రీకి హానికరం. ఇలా చేయడం క్రియేటర్స్ హార్డ్ వర్క్ అవమానించడమే అవుతుంది. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు... దయచేసి దీనిపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి. పైరేటెడ్ వెర్షన్ మూవీ ఫుటేజ్ అన్ని బస్సుల్లోనూ ప్లే చేయడాన్ని ఆపండి" అంటూ బన్నీ వాసు 'తండేల్' పైరేటెడ్ వెర్షన్ ను ప్లే బస్సులో ప్లే చేస్తున్న వీడియోతో పాటు టికెట్ ను, అలాగే బస్సు నెంబర్ ని కూడా పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 11న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో ఈ సినిమాను ప్లే చేశారని బన్నీ వాసు తెలిపారు.

Also Read: ప్రతీసారి తగ్గను... నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు - విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్

మత్స్యకారుల నేపథ్యంలో దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన మూవీ 'తండేల్'. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 70 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. మరోవైపు 'తండేల్' మూవీని పైరసీ భూతం వెంటాడుతోంది. రిలీజ్ అయిన మొదటి రోజే ఈ మూవీ పైరసీ వెర్షన్ హెచ్‌డి ప్రింట్ అందుబాటులోకి వచ్చింది. ఇక రెండవ రోజు ఏకంగా ఆర్టీసీ బస్సులోనే ఈ పైరేటెడ్ వెర్షన్ ను ప్రదర్శించడం చర్చకు దారి తీసింది. 

ఈ విషయంపై నిర్మాత బన్నీ వాసు స్పందిస్తూ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఏపీఎస్ఆర్టీసీ సంస్థ చైర్మన్ కు రిక్వెస్ట్ చేశారు. దీంతో ఆ సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు దీనిపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూవీని పైరసీ చేసే వాళ్లే కాదు, చూసేవాళ్ళు కూడా చట్టబద్ధంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బన్నీ వాసు హెచ్చరించిన విషయం విదితమే. అయినప్పటికీ 'తండేల్' పైరేటెడ్ వెర్షన్ ఇంకా ఆర్టీసీ బస్సుల్లో చక్కర్లు కొడుతుండడంతో అక్కినేని అభిమానులు ఫైర్ అవుతున్నారు. 

Also Readనా తల్లి బతికున్నప్పుడు తిడితే నరికేసేవాడిని... ఆస్పత్రి బెడ్ నుంచి పృథ్వీ ఇంటర్వ్యూ... 'లైలా' కాంట్రవర్సీపై వైసీపీ సోషల్ మీడియాకు వార్నింగ్

Continues below advertisement