Thandel Collections: బాక్సాఫీస్ వద్ద 'తండేల్' జాతర - రూ.100 కోట్ల మైల్‌స్టోన్‌కు హిట్టు బొమ్మ.. నాగచైతన్య కెరీర్‌లోనే తొలిసారిగా..

Thandel Box Office Collections: బాక్సాఫీస్ వద్ద 'తండేల్' కలెక్షన్ల జాతర కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Continues below advertisement

Thandel Collections To Reach 100 Crores Club: అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన 'తండేల్' (Thandel) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జాతర కురిపిస్తోంది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కాగా.. తొలి రోజు నుంచే రికార్డు కలెక్షన్లతో జోరు కొనసాగిస్తోంది. తొలి 2 రోజుల్లోనే రూ.21 కోట్లతో మొదలై వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.90.12 కోట్లు రాబట్టగా.. తాజాగా, రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. అంతే కాకుండా నాగచైతన్య సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. ఈ మేరకు 'బాక్సాఫీస్ దుళ్లకొట్టేశారు.. థియేటర్స్‌కు జాతర తెచ్చేశారు.' అంటూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించారు. అటు, ఓవర్సీస్‌లోనూ 'తండేల్' అదరగొడుతోంది. 

Continues below advertisement

'తండేల్ మా నమ్మకాన్ని నిలబెట్టింది'

'తండేల్' సినిమా షూట్ అయినప్పుడు ఎన్ని కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తుందనే ఆలోచనే తమ యూనిట్‌కు లేదని దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) తెలిపారు. అయితే, ఈ చిత్రం తమకు మంచి గౌరవాన్ని తీసుకొస్తుందని బలంగా నమ్మినట్లు చెప్పారు. 'ప్రేక్షకులు సైతం అంతే గౌరవంతో గొప్ప ఘన విజయాన్ని అందించారు. 'తండేల్' మా నమ్మకాన్ని నిలబెట్టింది. అలాగే కలెక్షన్లలో రూ.100 కోట్లకు చేరువ కావడం సంతోషంగా ఉంది. ఈ కథను తొలిసారి విన్నప్పుడు పాక్ నేపథ్యంలో చేద్దామనుకున్నా. ఇద్దరు ప్రేమికులు ఓ విషయాన్ని కమ్యూనికేట్ చేయాలంటే నెల రోజులు ఆగాలి. ఆ పాయింట్ నాకు బాగా అనిపించి.. ఈ చిత్రాన్ని భావోద్వేగాలతో కూడిన అందమైన, స్వచ్ఛమైన ప్రేమకథ అనే ప్రమోట్ చేశాం.

చైతూ ఫుల్ ఎఫెర్ట్స్ పెట్టారు కాబట్టే 'తండేల్' సక్సెస్‌ను మించి ప్రశంసలు దక్కుతున్నాయి. ఆయన కెరీర్‌లోనే రూ.100 కోట్ల సినిమా ఇది. ఈ సినిమా పైరసీ బారిన పడినప్పుడు ఎంతో బాధపడ్డాం. నా తర్వాతి చిత్రం కార్తికేయ 3, సూర్య గారితో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తాను.' అని చందూ మొండేటి పేర్కొన్నారు.

Also Read: మెగా మేనల్లుడితో పాటు 'విశ్వంభర'లో మరో మెగా సెలబ్రిటీ - ఇంట్రో సాంగ్ మామూలుగా ఉండదు మరి

ప్రేక్షకులు మెచ్చిన 'తండేల్' కథేంటంటే.?

ఉత్తరాంధ్రలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా 'తండేల్' మూవీని చందు మొండేటి తెరకెక్కించారు. శ్రీకాకుళం జిల్లాలోని కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన 22 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి పొరపాటున పాక్ సముద్ర జలాల్లోకి వెళ్లగా.. అక్కడ కోస్ట్ గార్డు అధికారులు పట్టుకుంటారు. వారిని రక్షించుకునేందుకు కుటుంబసభ్యులు ఏం చేశారు.? ఈ కథకు లవ్ స్టోరీ, ఎమోషన్స్, దేశభక్తిని మిక్స్ చేసి  'తండేల్'ను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అద్భుతంగా రూపొందించారు. నాగచైతన్య, సాయిపల్లవి నటనకు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. 

'బుజ్జి తల్లి' పాటకు 100 మిలియన్ వ్యూస్

'తండేల్' సినిమా పాటలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇందులోని 'బుజ్జి తల్లి' డైలాగ్, పాట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ లవ్ సాంగ్ యూట్యూబ్‌లో ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి జావేద్ అలీ ఆలపించిన తీరు యూత్‌ను తెగ ఆకట్టుకుంది. 'ఏమి తప్పు చేశానే..' అంటూ సాగే శాడ్ వెర్షన్ సైతం వైరల్ అవుతోంది. 

Also Read: డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఈ వారమే, ఎప్పుడో తెలుసా?

Continues below advertisement