Vishwambhara: మెగా మేనల్లుడితో పాటు 'విశ్వంభర'లో మరో మెగా సెలబ్రిటీ - ఇంట్రో సాంగ్ మామూలుగా ఉండదు మరి
Vishwambhara hero introduction song specialty: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'లో మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ అతిథి పాత్రలో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతనికి తోడు మరొకరు వచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా రూపొందుతున్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర' (Vishwambhara). ప్రస్తుతం హైదరాబాద్ నగర శివారులలో సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇందులో మెగా మేనల్లుడు, సుప్రీం స్టార్ సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. ఆ విషయం ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు అతనికి తోడు మరొక మెగా సెలబ్రిటీ కూడా ఆ పాటలో సందడి చేయనున్నట్లు తెలిసింది.
'విశ్వంభర'లో మెగా డాటర్ నిహారిక కొణిదెల!
Niharika Konidela cameo in Vishwambhara: అవును... మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ ఒక్కరే కాదు... 'విశ్వంభర'లో నాగబాబు కుమార్తె మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా సందడి చేయనున్నారు.
'విశ్వంభర'లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కొరియోగ్రఫీ శోభి మాస్టర్ చేస్తున్నారు. ఈ సాంగ్ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. శనివారం జరిగిన చిత్రీకరణలో సాయి దుర్గా తేజ్ పాల్గొన్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే... ఆ పాటలో నిహారిక కూడా సందడి చేస్తారు. గురువారం వరకు సాంగ్ షూటింగ్ జరుగుతుందట. భారీ ఎత్తున చిత్రీకరిస్తున్న ఈ పాటలో మెగా ఫ్యామిలీ అతిథి పాత్రలు మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు అందరినీ అలరిస్తాయని సినిమా యూనిట్ చెబుతోంది.
Also Read: ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత, నటి కృష్ణవేణి మృతి
చిరంజీవి జంటగా త్రిష... వేసవిలో విడుదల?
మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో సౌత్ క్వీన్ త్రిష నటిస్తున్నారు. 'స్టాలిన్' తర్వాత వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా ఇది. మరొక కథానాయికగా 'నా సామి రంగా' ఫేమ్ ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. ఇషా చావ్లాతో పాటు సురభి, రమ్య పసుపులేటి కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ పురస్కార గ్రహీతలైన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ పనిచేస్తున్నారు.
Also Read: క్రిస్టియన్ వెడ్డింగ్ ఫోటోలు షేర్ చేసిన కీర్తి సురేష్... వైట్ గౌనులో ఏంజెల్‌లా మహానటి
సంక్రాంతికి విడుదల కావలసిన 'విశ్వంభర' సినిమా రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' కోసం వాయిదా పడింది. మే 9న 'జగదేక వీరుడు అతిలోక సుందరి' విడుదలైన తేదీన 'విశ్వంభర'ను సైతం థియేటర్లలోకి తీసుకు రావడానికి సన్నాహాలు జరిగినట్లు వినిపించాయి అయితే ఇప్పుడు విడుదల వాయిదా జూన్ నెలకు వెళ్లిందని మరొక టాక్.