Nithiin's Thammudu Movie Review: నితిన్ హీరోగా నటించిన తాజా సినిమా 'తమ్ముడు'. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మించారు. లయ, వర్షా బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రల్లో నటించారు. అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ ఎలా ఉంది? సినిమా ఓవర్సీస్ టాక్ ఏమిటి? అనేది ఒకసారి చూడండి. 

ఒక్క రాత్రిలో జరిగే కథ...పావుగంట తర్వాత నుంచి!'తమ్ముడు' కథంతా ఒక్క రాత్రిలో జరుగుతుందని ముందు నుంచి దర్శక నిర్మాతలు చెబుతున్నారు. సినిమా ప్రారంభంలో పావు గంట పాటు కొంత కథ జరిగిన తర్వాత... కథ రాత్రికి షిఫ్ట్ అయ్యిందట. అక్క కోసం ఒక తమ్ముడు ఎటువంటి యుద్ధం చేశాడు? ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎంత దూరం వెళ్ళాడు? అనేది క్లుప్తంగా కథ అని ప్రీమియర్స్ చూసిన జనాలు చెబుతున్నారు.

నేపథ్యం కొత్తగా ఉంది...కానీ తీసిన విధానం రొటీన్!శ్రీరామ్ వేణు కథలోని నేపథ్యం చాలా కొత్తగా ఉందని‌ ఓవర్సీస్ నుంచి రిపోర్ట్ వచ్చింది. కథను ఆయన చెప్పాలనుకున్న విధానంలోనూ ఒక నావల్టీ ఉందట. అయితే... స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్‌గా ఉందని, స్టోరీ లైన్ చిన్నది కావడం, ఒక్క రాత్రిలో జరిగే కథ కావడంతో సినిమా ముందుకు నత్త నడకన సాగిందని టాక్.

Also Read'ఉప్పు కప్పురంబు' రివ్యూ: స్మశానంలో స్థలం కోసం గొడవ... Amazon Prime Videoలో కీర్తీ సురేష్, సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

నితిన్ కష్టం తెలుస్తుంది...లయ సినిమాకు పెద్ద ప్లస్ ‌కానీ!నితిన్ పడిన కష్టం తెరమీద కనిపిస్తుందని,  ప్రేక్షకులు అందరికీ అది స్పష్టంగా తెలుస్తుందని ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ చెప్పే మాట.‌ 'తమ్ముడు'గా ఆయన 100% ఇచ్చారట. ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన లయ... తనలో నటిని‌ మరొకసారి‌ పరిచయం చేసిందని, భావోద్వేగభరిత సన్నివేశాలలో అద్భుతంగా నటించారని ఎన్ఆర్ఐ ఆడియన్స్ చెబుతున్నారు. రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్లు కాకుండా వర్షా బొల్లమ్మ, సప్తమి గౌడ కొత్తగా కనిపించారట. హీరోయిన్లు చేసే ఫైట్స్ సినిమాను డిఫరెంట్ యాంగిల్‌లో చూపించాయట. 

Also Read: ఆల్మోస్ట్ 1000 స్క్రీన్లు, 25 కోట్ల టార్గెట్... నితిన్ 'తమ్ముడు' బడ్జెట్ నుంచి ప్రీ రిలీజ్ బిజినెస్, సెన్సార్ వరకూ... ఈ డీటెయిల్స్ తెలుసా?

'తమ్ముడు' ఫస్టాఫ్ పరీక్ష పెట్టింది...ఇంటర్వెల్ తర్వాత స్పీడ్ పెరిగినా!'తమ్ముడు' ఫస్టాఫ్ ప్రేక్షకులకు పరీక్ష పెట్టే విధంగా ఉందని ఓవర్సీస్ నుంచి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్ బావుందని టాక్. ఫస్టాఫ్‌తో కంపేర్ చేస్తే... సెకండాఫ్ బెటర్. అయితే... సినిమాకు ఆడియన్స్ నుంచి 100% హిట్ టాక్ వస్తుందని చెప్పడం కష్టమే. ఓవర్సీస్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ అంతగా బాలేదు. తెలుగు రాష్ట్రాలలో ఆడియన్స్ నుంచి వచ్చే టాక్ బట్టి సినిమా కలెక్షన్స్ డిపెండ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే మౌత్ టాక్ ఇంపార్టెంట్.