నితిన్ (Nithiin)కు సరైన హిట్టు పడి చాలా రోజులైంది. 'భీష్మ' తర్వాత కలెక్షన్స్, ఆ స్థాయిలో అప్రిసియేషన్ వచ్చిన సినిమా లేదు. వరుస ఫ్లాపుల తర్వాత బ్రదర్ & సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో 'తమ్ముడు' (Thammudu 2025) చేశారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మించిన చిత్రమిది. థియేటర్లలో జూలై 4న విడుదల. ఈ సినిమా విడుదల అయ్యే స్క్రీన్స్ కౌంట్ నుంచి టికెట్ రేట్స్, ప్రీ రిలీజ్ బిజినెస్, సెన్సార్ సర్టిఫికెట్ వంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుసుకోండి.

ఆల్మోస్ట్ 1000 స్క్రీన్లలో 'తమ్ముడు'నితిన్ ట్రాక్ రికార్డ్ బాలేదు. ఆయనకు ఫ్లాప్స్ వచ్చినా 'తమ్ముడు'కు మాత్రం మంచి రిలీజ్ దక్కుతోంది. అందుకు కారణం దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాతలు. వాళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలు విజయాలు సాధించడమే. 

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 650కు పైగా స్క్రీన్లలో 'తమ్ముడు'ను రిలీజ్ చేస్తున్నారు. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్ కలిపితే 950 వరకు ఉంటాయని టాక్. ప్రజెంట్ నితిన్ మార్కెట్ బట్టి ఇది భారీ రిలీజ్ అని చెప్పాలి.  

టికెట్ రేటు 150 నుంచి 300 వరకు!Thammudu 2025 Ticket Prices: 'తమ్ముడు' కోసం టికెట్ రేట్లు పెంచలేదు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో హయ్యస్ట్ టికెట్ రేటు 150 మాత్రమే. మెజారిటీ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 200 రేటు ఉంది. కొన్ని ప్రీమియం లొకేషన్లలోని స్క్రీన్లలో మాత్రం రూ. 295 ఉంది. రిక్లయినర్ సీట్స్ చూస్తే రూ. 350 రేటుతో ఉన్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ రేటు పెట్టి టికెట్ కొనేందుకు ప్రేక్షకులు ముందుకు వస్తారు. 

సెంటిమెంట్ సినిమాకు 'ఏ' ఎందుకు?Thammudu 2025 Censor, Run Time Details: సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ బేస్ చేసుకుని 'తమ్ముడు' తీశారు. ఇటువంటి సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు? అంటే... యాక్షన్ సీన్స్! సాలిడ్ యాక్షన్ బ్లాక్స్ నాలుగైదు ఉన్నాయట. అందులో రక్తపాతం, విలన్ చేసే హింస వల్ల 'పెద్దలకు మాత్రమే ఈ సినిమా' అని సెన్సార్ తేల్చింది. సినిమా రన్ టైమ్ కూడా 2:34 గంటలే. 

'తమ్ముడు' బడ్జెట్ & బిజినెస్ ఎంత?Nithiin's Thammudu budget and pre release business: 'తమ్ముడు'కు రూ. 75 కోట్ల వరకు బడ్జెట్ అయినట్టు నిర్మాత 'దిల్' రాజు తెలిపారు. ఈ కథను మూడేళ్ళ క్రితం ఓకే చేశాను కనుక అంత ఖర్చు చేశామన్నారు. ఇప్పుడు అయితే ఈ కథను టేకప్ చేయమని చెప్పారు. బడ్జెట్ ఎక్కువ కావడంతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణు రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలిపారు.

Also Read: 'ఉప్పు కప్పురంబు' రివ్యూ: స్మశానంలో స్థలం కోసం గొడవ... Amazon Prime Videoలో కీర్తీ సురేష్, సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

రూ. 75 కోట్లు పెట్టి తీసిన 'తమ్ముడు' థియేట్రికల్ బిజినెస్ 24 కోట్లు. అలాగని 'దిల్' రాజుకు భారీ నష్టాలు రాలేదు. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ సినిమా 45 కోట్లు రాబట్టిందని తెలిసింది. రిలీజ్ తర్వాత హిట్ టాక్ వచ్చి థియేటర్ల నుంచి కలెక్షన్స్ వస్తే సేఫ్ జోన్‌లోకి వెళతారు.

Also Readపాన్ ఇండియా బాక్సాఫీస్ మీద టాలీవుడ్ దండయాత్ర - 2025 సెకండాఫ్‌లో ప్రతి నెల రెండు భారీ సినిమాలు... స్టార్ హీరోల సినిమా రిలీజ్ డేట్స్ లిస్ట్ ఇదిగో