Thaman About Akhanda 2 Release Controversy : ఇండస్ట్రీలో యూనిటీ లేదని ఎవరికి వారే అన్నట్లు ఉన్నారని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నారు. 'అఖండ 2 తాండవం' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌లో మూవీ రిలీజ్ కాంట్రవర్సీపై ఆయన రియాక్ట్ అయ్యారు.

Continues below advertisement

ఈ నెల 5న రావాల్సిన సినిమా వారం ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చిందని... వారు అనుకుంటే ముందే కేస్ వెయ్యొచ్చని కానీ లాస్ట్ మినిట్‌లో వచ్చి ఆపారని చెప్పారు తమన్. 'ఇండస్ట్రీలో యూనిటీ లేదు. మనం అనే స్ట్రాంగ్‌గా ఎవరూ లేరు. ఇది మనది అనుకుంటేనే అంతా బాగుంటుంది. ఛానల్స్ దొరికితే సలహాలు ఇస్తున్నారు తప్ప ప్రొడక్షన్ ఆఫీస్‌కు వెళ్లి మాట్లాడితే ప్రొడ్యూసర్స్‌కు చాలా బలం వచ్చేది. ప్రొడ్యూసర్స్ ముందు మంచిగా మాట్లాడి బయట ఎందుకు తప్పుగా మాట్లాడాలి. అందరూ కలిసి కష్టపడితేనే ఓ సినిమా రిలీజ్ అవుతుంది.' అని అన్నారు.

Continues below advertisement

'ఇండస్ట్రీకి దిష్టి తగిలింది'

మన టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా గొప్పదని... ఇక్కడున్న ఫ్యాన్స్ పవర్ మరెక్కడా లేదని అన్నారు తమన్. 'టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మిగిలిన వారికి ఈర్ష్య. మన పరిశ్రమకు దిష్టి తగిలింది. కానీ యూట్యూబ్ తెరిస్తే ఒకరినొకరు తిట్టుకోవడం చాలా నెగిటివిటీ అయిపోయింది. అందరం ఓ యూనిటీగా ఉండాలి. మన ఇండస్ట్రీని నేను సపోర్ట్ చేయకుంటే ఇంకెవరు చేస్తారు. అందరం కలిసి యూనిటీగా ఉండాల్సిన టైం వచ్చింది. దెబ్బ తగిలితే బ్యాండెయిడ్ వెయ్యండి. కానీ బ్యాండ్‌లా వాయించొద్దు. అది చాలా తప్పు. ప్రొడ్యూసర్స్ గెలవాలని అనుకున్న సినిమాను లాస్ట్ మినిట్‌లో ఎందుకు ఆపాలి?

రాత్రి 9 గంటలకు ప్రీమియర్ అంటే 7 గంటలకు ప్రొడ్యూసర్స్ ట్వీట్ వేయాల్సిన కర్మ ఏంటి? వాళ్లు ఎంతో కుమిలిపోయుంటారు. వాళ్ల గురించి ఎవరైనా ఆలోచించారా? వాళ్లకు ఓ ఫ్యామిలీ ఉంటుంది. జస్ట్ తప్పుగా మాట్లాడేస్తారు అంతే. ఎవరూ తప్పు చేయరు. ఏ విషయమైనా అందరూ ఆలోచించి చేయాలి. ఏది ఏమైనా ఈ సినిమా ఎప్పుడొచ్చినా మేము ధైర్యంగానే ఉన్నాం. బాక్సులు బద్దలై స్పీకర్స్ పేలతాయి కాలతాయ్ అని మాకు తెలుసు. ఈ సినిమాను అందరూ ఇంతటి సక్సెస్ చేసినందుకు ఆనందంగా ఉంది.' అని పేర్కొన్నారు.

Also Read : 'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?

మూవీ చూడనున్న ప్రధాని మోదీ

దేశ రాజధాని ఢిల్లీలో 'అఖండ 2 తాండవం' స్పెషల్ షో ఏర్పాటు చేయనున్నట్లు డైరెక్టర్ బోయపాటి శ్రీను తెలిపారు. ఈ షోను ప్రధాని మోదీ చూడబోతున్నట్లు చెప్పారు. సనాతన హైందవ ధర్మం నేపథ్యంలో తెరకెక్కిన మూవీ గురించి ఆయన తెలుసుకున్నారని... గొప్ప చిత్రానికి సపోర్ట్ ఇవ్వాలనేది ఆయన ఆలోచన అని అన్నారు. మరోవైపు, అఖండ 2 రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ.59 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. సినీ విమర్శకులు సైతం మూవీని చూసి ప్రశంసిస్తున్నారు. సనాతన ధర్మంతో పాటు సంస్కృతి సామాజిక అంశాలను మూవీలో చూపించారని... అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు.