డే 98 ఎపిసోడ్లో "ఆలస్యం లేకుండా మన టీవీ" అంటూ ఎపిసోడ్ లోకి తీసుకెళ్లారు నాగార్జున. "బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ గెలుచుకునే ప్రైజ్ మనీ, విన్నర్ ఇంటికి తీసుకెళ్లేది 50 లక్షలు" అంటూ రివీల్ చేశారు నాగార్జున. "దీనితో పాటు మారుతి సుజుకీ విక్టోరిస్ కారు కూడా విన్నర్ సొంతం. ఒకవేళ మీరు విన్నర్ అయితే ఆ ప్రైజ్ మనీతో ఏం చేస్తారో, ఇక్కడున్న ఐదుగురిలో ఎవరికి ఎంత ఇచ్చి పంపుతారు ? చెప్పాలి" అన్నారు నాగార్జున. 

Continues below advertisement

హౌస్ లోకి కొత్త హీరో ఎంట్రీ 

"దీంట్లోని కొంత అమౌంట్ ను ఓల్డేజ్ హోమ్ కి ఇస్తాను. డబ్బు ఇవ్వాలంటే డెమోన్, ఇమ్మూ గుర్తొస్తారు. ఇమ్మూకి 20 లక్షలు ఇస్తాను" అని చెప్పారు భరణి. "ఇంటి అప్పు తీర్చుకుంటా. నన్ను నమ్మిన అమ్మాయికి సింగిల్ పేరెంట్. అయినా డాక్టర్ చదివించింది. నేను ఎంత ఖర్చు అయినా సరే పీజీ చదివిస్తాను. అలాగే మా అక్క పిల్లలు, అన్నయ్యను చూసుకుంటా. 20 లక్షలు ఇచ్చి భరణిని పంపిస్తా" అన్నాడు ఇమ్మూ. తర్వాత డెమోన్ "మా నాన్నకు టంగ్ క్యాన్సర్. ఆయన ట్రీట్మెంట్ కి, తణుకులో ఇల్లు కట్టడానికి వాడుకుంటా. కామనర్ కాబట్టి కళ్యాణ్ తో 25 లక్షలు షేర్ చేసుకుంటా. రీతూ కి గిఫ్ట్ కొనడానికి 5 లక్షలు ఖర్చు పెడతా" అన్నాడు. "మంచి అమౌంట్ మా ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఇస్తా. అలాగే నడవలేక ఇబ్బంది పడేవాళ్ళకు లింబ్ కొనిస్తా. 10 లక్షలు నా పిల్లల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా. తనూజకు 15 లక్షలు ఇచ్చి తప్పిస్తా" అన్నది సంజన. "తనూజా నా ఫ్యామిలీకి ఏం ఇవ్వలేదు. దానికన్నా ముందు ఎడ్యుకేషన్ లేని పిల్లల చదువుకి హెల్ప్ చేస్తా. డెమోన్ కు 15 లక్షలు ఇస్తా" అని చెప్పింది. కళ్యాణ్ "అమ్మకు గోల్డ్, ముగ్గురు పిల్లలను అడాప్ట్ చేసుకుంటా. ఇమ్మూతో 25 లక్షలు షేర్ చేసుకుంటా" అన్నాడు. నెక్స్ట్ ఫైనలిస్ట్ గా ఆల్చిప్పను స్విమ్మింగ్ పూల్ లో వదిలేసి తనూజను అనౌన్స్ చేశారు. 

Continues below advertisement

'న్యూ గాయ్ ఇన్ టౌన్' అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను ఆహ్వానించి, మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా హీరో అనీష్ ను పిలిచి ముచ్చటించారు. ఈ సినిమాకు నాగార్జున వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. తరువాత హౌస్ లోని వారు ఈ సీజన్లో ది మోస్ట్ పాపులర్ సిట్యుయేషన్ ను రీక్రియేట్ చేయాలి అనే టాస్క్ ఇచ్చారు నాగార్జున. భరణి - సంజనాకు పవన్ డెమోన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన సీన్ ను ఇచ్చారు.  హరీష్ - ఇమ్మూ గొడవను డెమోన్ -ఇమ్మూ, ట్రయాంగిల్ ఇష్యూను కళ్యాణ్, సంజన, తనూజ, భరణిలతో చేయించారు. తనూజా విజిల్ నామినేషన్ ను భరణి, తనూజా... పోపు గొడవను సంజన, ఇమ్మూ, భరణి... సుమన్, సంజన నామినేషన్ గొడవను ఇమ్మూ, డెమోన్ తో చేయించారు. సుత్తితో గోడను పగలగొట్టి థర్డ్ ఫైనలిస్ట్ గా డెమోన్ ను రివీల్ చేశారు. 

టాప్ 5 కంటెస్టెంట్స్ 

"హౌస్ లో ఎవరి మీద అయినా కంప్లైంట్ ఉంటే మీ కోపం తీర్చుకోండి. ప్రతీ కంప్లైంట్ కు ఒక ట్రీట్" అని చెప్పారు నాగ్. తనూజ ఇమ్మూ పై కంప్లైంట్ చేసి ట్రీట్స్ కొట్టేసింది. కాఫీ పౌడర్ ట్రీట్ రావడంతో "ఈ వీక్ కి ఇది చాలు" అన్నది తనూజా. అది విని "దుర్మార్గురాలా" అనేశారు నాగ్. డెమోన్ తనూజపై, ఇమ్మూ సంజనాపై, భరణి సంజనపై, కళ్యాణ్ భరణిపై, సంజన డెమోన్ పై కంప్లైంట్స్ చేశారు. ఆ తరువాత నాలుగవ ఫైనలిస్ట్ ఇమ్మూను రివీల్ చేశారు. ఫైనల్ ఫైనలిస్ట్ సంజనాను ఫీనిక్స్ బర్డ్ ద్వారా రివీల్ చేయగా, భరణి ఎలిమినేట్ అయ్యాడు. టాప్ 5లో సంజన గుడ్ ఫైటింగ్ స్పిరిట్, డెమోన్ స్ట్రాంగ్, ఇమ్మూ ఫైటర్, కళ్యాణ్ కు హ్యాట్సాఫ్, తనూజా ట్రోఫీ తెచ్చి నన్ను ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేయాలి అని చెప్పాడు. తరువాత టాప్ 5 సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు.