Tension At Bengaluru Theater: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మేనియా నడుస్తోంది. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోస్ వేయనుండగా థియేటర్స్ వద్ద పవన్ ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. తమ అభిమాన హీరో కటౌట్స్‌తో థియేటర్స్ వద్ద హంగామా సృష్టిస్తున్నారు. స్క్రీన్‌పై పవన్ కనిపించగానే ఈలలు, కేకలతో సందడి చేసేందుకు ఫుల్ జోష్‌తో రెడీ అవుతున్నారు.
బెంగుళూరు థియేటర్ వద్ద ఉద్రిక్తత
ఈ నేపథ్యంలో బెంగుళూరులో 'హరిహర వీరమల్లు' రిలీజ్ కానున్న థియేటర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. స్థానిక సంధ్య థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు. అయితే, బ్యానర్లలో 'కన్నడ' భాష లేదని కొందరు స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కటౌట్స్ తొలగించేందుకు యత్నించగా ఫ్యాన్స్ అడ్డుకున్నారు.
దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కన్నడిగులు ఫ్యాన్స్‌తో వాగ్వాదానికి దిగారు. కటౌట్‌లో తెలుగు భాషే ఉందని కన్నడ రాష్ట్రంలో కన్నడ భాష ఉండాల్సిందేనంటూ వారు పట్టుబట్టారు. వివాదం ముదురుతుండగా పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారికి సద్దిచెప్పారు. దీంతో ఫ్యాన్స్ మిన్నకుండిపోయారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా... సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినీ అభిమానానికి భాషను రుద్దొద్దంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా... సినిమాను సినిమాలానే చూడాలంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: పవన్ 'హరిహర వీరమల్లు' కచ్చితంగా చూడాల్సిందే! - ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ హంగామా
ఇక పవన్ మూవీ రిలీజ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రధాన నగరాల్లో ప్రీమియర్ షోస్‌తో పాటు సినిమా రిలీజ్ అవుతున్న అన్నీ థియేటర్స్ వద్ద కటౌట్స్, భారీ పువ్వుల దండలతో నింపేశారు. హైదరాబాద్‌లో ఫ్యాన్స్ అసోసియేషన్లు ప్రత్యేకంగా థియేటర్లలో చల్లేందుకు ఏకంగా వెయ్యి కేజీల పేపర్లను రెడీ చేశారు. వీటన్నింటినీ మిషన్ సాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫ్యాన్స్ హంగామా అంటే మామూలుగా ఉండదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏర్పాట్లతో చాలా ప్రాంతాల్లో పాత పేపర్లు దొరకడం లేదనే టాక్ వినిపిస్తోంది. కొన్ని థియేటర్స్ వద్ద పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. 'భీమ్లా నాయక్' తర్వాత పవన్ నుంచి వస్తోన్న మూవీ కావడం, ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత రిలీజ్ అవుతోన్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో ఎ దయాకరరావు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పవర్ ఫుల్ యోధుడిగా పవన్ కనిపించనుండగా... ఆయన సరసన అందాల నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. బాబీ డియోల్ విలన్ రోల్ చేయగా... నర్గీస్ ఫక్రీ, నాజర్, అనుపమ్ ఖేర్, జిషు సేన్ గుప్తా, సత్యరాజ్, నోరా ఫతేహి, సుబ్బరాజు, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు.