Adivi Sesh And Mrunal Thakur Injured In Shooting Set: యంగ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న అవెయిటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... తాజాగా సెట్‌లో చిన్న యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది.
ఓ కీలకమైన యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రమాదవశాత్తు కింద పడిపోయినట్లు సమాచారం. కాస్త గట్టిగానే గాయలైనట్లు తెలుస్తుండగా... ఆ గాయాలతోనే హీరో హీరోయిన్లు షూటింగ్ పూర్తి చేశారనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై మూవీ టీం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఆకట్టుకునే అడివిశేష్ ఈసారి కూడా వైవిధ్యమైన లవ్, యాక్షన్ డ్రామా 'డెకాయిట్'తో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. ఇద్దరు లవర్స్ బద్ద శత్రువులుగా ఎలా మారారు? రోడ్డు మీద శవాల మధ్య వారి మధ్య వార్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. షానీల్ డియో దర్శకత్వం వహించగా... అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ సంస్థలపై కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా... ఆడియో రైట్స్ భారీ ధరకు సేల్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ సంస్థ సోనీ మ్యూజిక్ హక్కులను రూ.8 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.