Pawan Kalyan's Hari Hara veera Mallu First Review Censor Report: వీరమల్లు థియేటర్లలోకి రావడానికి ముందు సెన్సార్ నుంచి రిపోర్ట్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 'హరిహర వీరమల్లు' విడుదల ముందు సినిమా టాక్ బయటకు వచ్చింది. అటు సెన్సార్, ఇటు యూనిట్ ఇన్‌సైడ్ వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం సినిమా ఎలా ఉంది? అంటే...
మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్...పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో!కెరీర్ స్టార్టింగ్ నుంచి పవన్ కళ్యాణ్ మోడ్రన్ స్టోరీస్ ఎక్కువ చేశారు. ఆయనకు స్టార్ డమ్ తీసుకు వచ్చిన సినిమాలు అన్నీ ప్రేమ - కుటుంబ కథలే. 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'ఖుషి' నుంచి 'అత్తారింటికి దారేది' వరకు ఆయన కెరీర్‌లో బ్లాక్ బస్టర్ సినిమాలు అన్నీ ప్రజెంట్ జనరేషన్ కథలే. ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ / హిస్టారిక్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో సినిమా చేశారు.కథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే... కోహినూర్ కోసం తెలుగు గడ్డ మీద నుంచి మొఘల్ రాజును ఢీ కొట్టడానికి వెళ్లిన వీరమల్లు ప్రయాణమే సినిమా.
పవన్ కళ్యాణ్ (How Was Pawan Kalyan Acting In HHVM?)ను వీరమల్లుగా, ఈ కథలో చూడటం కొత్తగా ఉంటుందని ఆల్రెడీ సినిమా చూసిన జనాలు చెప్పే మాట. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ ప్లస్ పవన్ లుక్స్ మేజర్ హైలైట్ అంటున్నారు. నటన పరంగా పవన్ స్క్రీన్ మీద కనిపించినంత సేపూ మరొకరి మీదకు ప్రేక్షకుల చూపు వెళ్లడం కష్టమేనట. అంతలా వన్ మ్యాన్ షో చేశారట. ఇక పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సీక్వెన్స్ మూవీ మొత్తానికి హైలైట్ అని, థియేటర్ల నుంచి ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం గ్యారెంటీ అని అంటున్నారు.
'యానిమల్' చూసిన కళ్లతో ఔరంగజేబు చూస్తే బాబీ డియోల్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ కావచ్చు. కానీ, ఆయన నటన మాత్రం ఎక్స్‌లెంట్. నిధి అగర్వాల్ తన పాత్ర వరకు న్యాయం చేశారు.
పవన్ కళ్యాణ్ తర్వాత కీరవాణి...సంగీతంతో మాయ చేసిన పెద్దన్న!హిస్టారికల్ సినిమాలకు పాటలు, సంగీతం ఎంత ముఖ్యమనేది 'హరి హర వీరమల్లు' మరోసారి ప్రూవ్ చేస్తుందని చెబుతున్నారు. 'బాహుబలి'తో పాటు రాజమౌళి సినిమాల విజయంలో కీరవాణి సంగీతం కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాకు కూడా అంతేనట.
పాటలు విన్నప్పుడు కంటే స్క్రీన్ మీద చూసినప్పుడు గూస్ బంప్స్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు. ముఖ్యంగా 'అసుర హరణం' పాటలో హీరోయిజం ఎలివేట్ చేసిన తీరు పీక్స్ అంటున్నారు. నేపథ్య సంగీతంలోనూ కీరవాణి మార్క్ బలంగా కనిపించిందట.
కథతో పాటు కామెడీ కాస్త వీక్?సినిమాలో మైనస్ పాయింట్స్ అవేనా?నిర్మాత ఏయం రత్నం ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించడం వల్ల ప్రతి ఫ్రేమ్ గ్రాండ్‌గా ఉందని టాక్. అయితే సినిమాలో కథతో పాటు కామెడీ కాస్త వీక్ అని ఎర్లీ రిపోర్ట్స్ వస్తున్నాయ్. కథ వీక్ అంటే చరిత్రకారులు కొందరు కథపై అభ్యంతాలు వ్యక్తం చేసే అవకాశం ఉందని తెలిసింది. అదొక్కటే సినిమాలో మైనస్ పాయింట్స్.
వీరమల్లు ఫిక్షనల్ క్యారెక్టర్ అని మేకర్స్ ముందు నుంచి చెబుతున్నారు. అయితే కోహినూర్ లభించిన సమయం, అది మొఘల్ రాజుల దగ్గరకు వెళ్లిన కాలం, ఔరంగజేబు పాలించిన సమయంలో చార్మినార్ ఉందా? వంటి లాజిక్కులు కొందరు తీసే అవకాశాలు ఉన్నాయట. పవన్ సినిమా అంటే వైసీపీ శ్రేణులు ఎలాగో ట్రోల్ చేస్తాయి. వాళ్ళను పక్కన పెడితే సామాన్య ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని ఇన్‌సైడ్ టాక్. పవన్ అభిమానులకు అయితే చెప్పాల్సిన అవసరం లేదు... పండగ తెస్తుందట. 'బాహుబలి'తో కంపేర్ చేయలేం గానీ ఫ్యాన్స్‌ను అయితే డిజప్పాయింట్ చేయదు.