Suriya New Look From Venky Atluri Movie: కోలీవుడ్ స్టార్ సూర్య డైరెక్ట్‌గా తెలుగులో ఫస్ట్ మూవీ వెంకీ అట్లూరితో చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం సూర్య బర్త్ డే సందర్భంగా మూవీ టీం స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెష్ చెప్పింది.

స్టైలిష్ వింటేజ్ లుక్

ఈ మూవీలో స్టైలిష్ వింటేజ్ లుక్‌లో సూర్య అదరగొట్టారు. తెలుగులో ఆయన ఫస్ట్ మూవీ కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. 'మా ప్రియమైన సూర్య గారికి అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అభిరుచి, ఉనికి ప్రతి ఫ్రేమ్‌ను వెలిగిస్తుంది.' అంటూ సోషల్ మీడియా వేదికగా విషెష్ చెప్పారు టీం. 'మా హీరో సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిరంతరం తన ప్రతిభను చాటుతున్న నటుడు. సినిమాలో వింటేజ్ సూర్యను మీకు చూపించేందుకు మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం.' అంటూ ప్రొడ్యూసర్ నాగవంశీ రాసుకొచ్చారు.

Also Read: 'డెకాయిట్' షూటింగ్ స్పాట్‌లో యాక్సిడెంట్! - అడివిశేష్, మృణాల్ ఠాకూర్‌లకు గాయాలు?

సూర్య 46వ చిత్రంగా ఈ మూవీని వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు. 'లక్కీ భాస్కర్' వంటి భారీ హిట్ తర్వాత వెంకీ సినిమాను తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సూర్య సరసన ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు. రవీనా టాండన్, రాదికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్స్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభం కాగా ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. 

ఒకే రోజు రెండు సర్ ప్రైజ్‌లు

సూర్య బర్త్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెష్ చెబుతున్నారు. వెంకీ అట్లూరి మూవీతో పాటే ఆయన తమిళంలో 'కరుప్పు' మూవీ కూడా చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఆయన బర్త్ డే స్పెషల్‌గా టీజర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. పవర్ ఫుల్ మాస్ లుక్, యాక్షన్‌తో గూస్ బంప్స్ తెప్పించారు. వీరభద్రుడిలా బలమైన వెపన్‌తో ఆయన ఎంట్రీ అదిరిపోయింది. 

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ మూవీ నిర్మిస్తుండగా... ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తుండగా... వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.