జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran) రూపొందించిన తమిళ సినిమా 'విడుతలై'. రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఈ రెండు భాషల్లో తమిళ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన హాస్య నటుడు సూరి (Comedian Soori) కథానాయకుడిగా నటించారు. ప్రత్యేకమైన ప్రధాన పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించారు. తమిళనాడులో గత నెలలో (మార్చి 31న) విడుదల అయ్యింది. రెండు వారాలు ఆలస్యంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 


ఏప్రిల్ 15న తెలుగులో 'విడుదల'
'విడుతలై పార్ట్ 1'ను తెలుగు ప్రేక్షకుల ముందుకు 'విడుదల పార్ట్ 1'గా తీసుకు వస్తున్నారు. ఏప్రిల్ 15న తెలుగులో సినిమాను విడుదల చేయనున్నట్లు ఈ రోజు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లు ఆసక్తి కలిగించేలా ఉన్నాయి.


Also Read : బాలకృష్ణతో సినిమా నా కోరిక, చిరుతో పూనకాలు లోడింగ్ - స్టార్స్‌తో సినిమాలపై 'దిల్' రాజు క్రేజీ అప్డేట్స్






అల్లు అరవింద్ చేతికి 'విడుదల'
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind)కి చెందిన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా 'విడుదల' తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. దర్శకుడు వెట్రిమారన్, నిర్మాత ఎల్రెడ్ కుమార్ ఇటీవల గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వచ్చారు. అల్లు అరవింద్‌ను కలిశారు. తమ సినిమాను తెలుగులో విడుదల చేయమని కోరడంతో ఆయన ఓకే అని చెప్పారని తెలిసింది. 


మంచి సినిమాలను ప్రోత్సహించడంలో అల్లు అరవింద్ ఎప్పుడూ ఓ అడుగు ముందు ఉంటారు. ట్రెండ్ ఫాలో అవ్వడమే కాదు, ట్రెండీ సినిమాలు కూడా తీసుకుంటారు. న్యూ ఏజ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ప్రొడ్యూస్ చేయడం కోసం జీఏ2 పిక్చర్స్ స్టార్ట్ చేశారు. ఇతర భాషల్లో విడుదలైన మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించడం కోసం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. కన్నడ బ్లాక్ బస్టర్ 'కాంతార'ను తెలుగులో విడుదల చేశారు. ఇప్పుడు 'విడుదల'ను తీసుకు వస్తున్నారు.


విడుదల... పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్!
పీరియాడిక్ పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్ (Viduthalai Part 1 Genre)గా 'విడుదల పార్ట్ 1'ను వెట్రిమారన్ తెరకెక్కించారు. రెండు భాగాలుగా సినిమా రూపొందింది. ఒకేసారి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశారు. తమిళనాట థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాకు ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ కలెక్షన్లు భారీగా వస్తున్నాయి.


'విడుతలై'లో ధనుష్ పాట... 
తెలుగులో ఎవరు పాడతారో?
'విడుదల పార్ట్ 1'లో ఓ పాటను ప్రముఖ తమిళ కథానాయకుడు ధనుష్ పాడారు. ఇళయరాజా సంగీతంలో 'ఓన్ దొణక్కి నాందా' అంటూ ఆయన పాడిన పాట హృద్యంగా సాగుతుంది. తమిళ ప్రేక్షకుల నుంచి ఆ పాటకు విపరీతమైన స్పందన లభించింది. ఆ సాంగ్ మేకింగ్ వీడియో చూస్తే... ఇళయరాజా దగ్గర ఉండి మరీ ధనుష్ చేత పాడించారు. తెలుగులో ఆ పాటను ఎవరు పాడతారో చూడాలి. విజయ్ సేతుపతి, సూరితో పాటు భవాని శ్రీ, ప్రకాశ్ రాజ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon), రాజీవ్ మీనన్, చేతన్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రానికి ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందించారు. వెల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. 


Also Read మళ్ళీ చిక్కుల్లో 'ఆదిపురుష్' - శ్రీరామనవమి పోస్టర్ మీద ముంబైలో కంప్లైంట్