Dil Raju Twitter Chat : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిర్మాతగా వి. వెంకట రమణా రెడ్డి ప్రయాణం 'దిల్' సినిమాతో మొదలైంది. ఆ తర్వాత నుంచి ఆయన పేరు 'దిల్' రాజుగా మారింది. ఆ సినిమా కంటే ముందు పంపిణీదారునిగా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసినా... 'దిల్'తో ఆయన ఇంటి పేరు మారింది. అసలు పేరు అయ్యింది.
నితిన్ కథానాయకుడిగా వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన 'దిల్' సినిమా ఏప్రిల్ 4, 2003లో విడుదలైంది. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా సోషల్ మీడియాలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు 'దిల్' రాజు సమాధానాలు ఇచ్చారు. బాలకృష్ణ, ఎన్టీఆర్, ప్రభాస్... తదితరులతో సినిమాలపై ఆయన స్పందించారు.
బాలకృష్ణతో సినిమా చేయాలనేది నా కోరిక కూడా!
పవన్ కళ్యాణ్, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, రవితేజ, అల్లు అర్జున్, ఎన్టీఆర్, అక్కినేని నాగచైతన్య తదితర హీరోలతో 'దిల్' రాజు సినిమాలు నిర్మించారు. బాలకృష్ణతో ఎప్పుడూ సినిమా చేయలేదు.
'బాలకృష్ణతో సినిమా ఏదైనా ప్లాన్ చేయొచ్చు గా సార్?' అని ఓ నెటిజన్ అడిగితే... ''అది నా కోరిక కూడా'' అని 'దిల్' రాజు సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్ హీరోగా 'బృందావనం', 'రామయ్యా వస్తావయ్యా' సినిమాలు నిర్మించారు. మళ్ళీ ఆయనతో సినిమా ఎప్పుడు అని అడిగితే ''త్వరలో ఉంటుంది'' అని సమాధానం ఇచ్చారు. ప్రభాస్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ అయ్యాక సినిమా ఉంటుందని సమాచారం.
మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఎప్పుడు? అని ఒకరు ప్రశ్నిస్తే... ''పూనకాలు లోడింగ్'' అని ఆన్సర్ ఇచ్చారు 'దిల్' రాజు. మాస్ మహారాజా రవితేజతో సినిమా గురించి అడిగినప్పుడూ అదే ఆన్సర్ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్వరలో మరో సినిమా ఉంటుందని చెప్పారు. ఆల్రెడీ నేచురల్ స్టార్ నాని హీరోగా 'నేను లోకల్', 'ఎంసీఏ' సినిమాలు చేశారు. ఆయనతో మరో సినిమా ఎప్పుడు? అని అడిగితే... హ్యాట్రిక్ పక్కా అని చెప్పారు.
మహేష్ బాబుతో నెక్స్ట్ లెవల్!
వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమా తీశారు 'దిల్' రాజు. 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల్లో ఆయన నిర్మాణ భాగస్వామి. మళ్ళీ మహేష్ బాబుతో సినిమా ఉంటుందని తెలిపారు. అదీ కూడా నెక్స్ట్ లెవల్ సినిమా అని పేర్కొన్నారు 'దిల్' రాజు.
Also Read : మళ్ళీ చిక్కుల్లో 'ఆదిపురుష్' - శ్రీరామనవమి పోస్టర్ మీద ముంబైలో కంప్లైంట్
సూపర్ స్టార్ రజనీకాంత్, కన్నడ కథానాయకుడు యశ్ హీరోలుగా కూడా సినిమాలు ఆశించవచ్చని 'దిల్' రాజు పేర్కొన్నారు. మొత్తం మీద ఏ హీరోతో సినిమా అడిగినా సరే ఉంటుందని చెప్పుకొచ్చారు. తర్వాత ప్రశ్నిస్తే... 'కథలు కుదరాలి కదా' అని సమాధానం వస్తుంది ఏమో!?
'బొమ్మరిల్లు' అంటే ఇష్టం
తాను ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో 'బొమ్మరిల్లు' అంటే ఇష్టమని 'దిల్' రాజు స్పష్టం చేశారు. ఆ సినిమా రీ రిలీజ్ చేయమని ఓ నెటిజన్ అడిగితే.... 'చేద్దామా?' అని ప్రశ్నించారు. 'ఆర్య' సినిమా విడుదలై వచ్చే ఏడాదికి 20 ఏళ్ళు పూర్తి అవుతాయని, అప్పుడు ఆ సినిమాను రీ రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు.
Also Read : పెళ్లికి ముందు పూర్ణ ప్రెగ్నెంటా? వివాహమైన ఆరు నెలలకు బాబు