అల్లు అర్జున్ (Allu Arjun) చాలా జోవియల్ అన్న సంగతి అనేక సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. 'పుష్ప' (Pushpa Movie)తో ఆలిండియా రేంజ్ కు ఎదిగిన ఐకాన్ స్టార్... ఇప్పుడు మరింత మెచ్యూర్డ్ గా ఉంటూ వస్తున్నారు. అయితే హుందాగా ఉండటాన్ని నటిస్తున్నాని... తాను ఒరిజినల్‌గా  సరదాగా ఉండటానికే ఇష్టపడతానని ఆయన చెప్పారు. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2' (Telugu Indian Idol Season 2 Finale)లో అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. సీజన్ గ్రాండ్ ఫినాలేకి గెస్ట్‌గా వచ్చిన ఐకాన్ స్టార్ తన లైఫ్‌లో ఓ ముఖ్యమైన విషయాన్ని బయట పెట్టారు. 


ఐకానిక్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ పార్ట్ 1ను ఆహా శనివారం సాయంత్రం స్ట్రీమింగ్ చేసింది. ఫైనల్‌కు చేరుకున్న టాప్ 5 కంటెస్టెంట్ల పెర్‌ఫార్మెన్స్‌ మొదలైంది. ఈ ఫినాలేకు గెస్టుగా వచ్చిన అల్లు అర్జున్ కొన్ని ముఖ్యమైన సంగతులను పంచుకున్నారు. శనివారం ఎపిసోడ్‌లో ఫైనల్ కంటెస్టెంట్లు సౌజన్య, కార్తికేయ, శృతి నండూరి తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇందులో అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన పాటలు వచ్చినప్పుడు... వాటి వెనుక ఉన్న సంగతులను పంచుకున్న ఆయన మరో ముఖ్యమైన సంగతినీ బయటపెట్టారు. 


ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు శృతి!
ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ సింగర్ శృతి నండూరి గీతాలకు ఫిదా అయిన స్టైలిష్ స్టార్... తన మొదటి గర్ల్‌ ఫ్రెండ్ పేరు శృతినే అంటూ బయటపెట్టేశారు. ఈ విషయాన్ని ఫస్ట్ టైమ్ బయటకు చెబుతున్నా అన్న ఆయన... “ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్లాలో” అంటూ సరదాగా నవ్వేశారు. 


ఇండియన్ ఐడల్ ఫస్ట్ సీజన్ సూపర్‌ హిట్ అవ్వడంతో ఆహా సెకండ్ సీజన్‌ను కూడా గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. మొత్తం పదివేల మంది 'తెలుగు ఇండియన్ ఐడల్ 2' (Telugu Indian Idol Season 2)లో పార్టిసిపేట్ చేయాలని తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు... విదేశాల నుంచి సైతం ప్రయత్నించారు. అందులో 12 మందిని ఎంపిక చేశారు. టైటిల్ కోసం వాళ్ళందరూ పోటీ పడ్డారు. ఇప్పుడు ఆ మజిలీ తుది ఘట్టానికి చేరుకుంది. తుది సమరంలో ఐదు మంది నిలిచారు. వారిలో విజేతను ఆదివారం సాయంత్రం స్ట్రీమ్ అయ్యే ఎపిసోడ్‌లో అనౌన్స్ చేస్తారు.


Also Read : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు!
 
విశాఖకు చెందిన సౌజ‌న్య భాగ‌వ‌తుల, హైదరాబాద్‌ కు చెందిన కార్తికేయ, న్యూజెర్సీ నుంచి వచ్చిన డాక్టర్ శృతి, సిద్దిపేట అమ్మాయి లాస్య ప్రియ, మరో హైదరాబాదీ జయరామ్ ఫైనల్స్‌ లో పోటీ పడుతున్నారు. మొదటి ముగ్గురి ప్రదర్శనలు మొదటి ఎపిసోడ్‌లో అయిపోయాయి. ఆదివారం ఎపిసోడ్‌లో మిగతా ఇద్దరి ప్రదర్శనలతో పాటు... విజేత ను నిర్ణయించే ఫైనల్ రౌండ్ కూడా ఉంటుంది. ఫైనల్స్ లో కేవలం పార్టిసిపెంట్లు మాత్రమే కాదు. న్యాయ నిర్ణేతలు తమన్, కార్తీక్, గీతా మాధురి కూడా ఈ ఎపిసోడ్ లో తమ ప్రదర్శనలతో అదరగొట్టారు.


'తెలుగు ఇండియన్ ఐడల్' సీజన్ 2’ కొన్ని వారాలుగా విజయవంతంగా నడుస్తోంది. మిగతా ఎపిసోడ్స్ లో  బాలయ్య స్పెషల్‌ డాన్స్‌ తో అలరించగా... దేవీ శ్రీ ప్రసాద్, కోటి, విశ్వక్‌సేన్, అల్లరి నరేష్ వంటి వారు మిగతా ఎపిసోడ్లలో పాల్గొన్నారు.


Also Read మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?