ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ కేసు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతుంది. ఈ వ్యవహారం బయటకు రావడతో డ్యాన్స్‌ అసోసియేషన్‌ నుంచి ఆయనకు తీవ్ర వ్యతిరేకత వస్తుంది. తెలుగు ఫిలిం డ్యాన్స్‌ అండ్‌ టీవీ డ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని అసోసియేషన్‌ సభ్యుల నుంచి డిమాండ్స్‌ వస్తున్నాయి. దీంతో ఆయనపై ఈ ఆరోపణలు తేలేవరకు జానీని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్‌ను ఇప్పటికే ఆదేశించినట్టు ఫిలిం ఛాంబర్‌ సెక్రటరీ దామోదర్‌ ప్రసాద్‌ తెలిపారు.


అంతేకాదు పలువురు సినీ ప్రముఖులు కూడా జానీ మాస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం మరింత ముదురుతుండటంతో ఏకంగా ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మీడియా సమావేశం నిర్వహించి దీనిపై వివరణ ఇచ్చింది. ఈ మీడియాలో సమావేశంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వేజ్‌, ఫిలిం ఛాంబర్‌ సెక్రటరి మోదర్‌ ప్రసాద్‌, నటి, యాంకర్‌ జాన్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి జాన్సీ మాట్లాడుతూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. జానీ మాస్టర్‌ ఆ అమ్మాయి ఎంతోకాలం వేధిస్తున్నాడని, తను మైనర్‌గా ఉన్నప్పటి నుంచే ఆమెకు వేధింపులు జరుగుతున్నాయని చెప్పారు.


అయితే ఇది వర్క్‌ ప్లేస్‌ జరగలేదని, అందువల్ల పూర్తిగా ఈ కేసు తమ పరిధిలో లేదని షాకింగ్‌ విషయం చెప్పారు. అదే విధంగా జాన్సీ మాట్లాడుతూ... "ఇండస్ట్రీలో మహిళా రక్షణ కోసం సరైన గెడ్ లైన్స్ లేవు. నటి శ్రీ రెడ్డి వివాదం తర్వాత మహిళలపై లైంగిక వేధింపులపై ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించాం. జానీ మాస్టర్ వ్యవహారం తెరపైకి వచ్చిన వెంటనే ఆ కమిటీ దీనిపై విచారణ చేస్తుంది. కానీ, మొదట ఆ యువతి తనకు వర్క్‌లో ఇబ్బంది ఉందని, తన టాలెంట్‌కి తగ్గ వర్క్‌ ఇవ్వడం లేదని మీడియా ముందుకు వెళ్లింది. అప్పుడే డ్యాన్సర్‌ అసోసియేషన్‌లో అవకతవకలు ఉన్నాయి. 



ఈ కేసు పూర్తిగా మా పరిధిలో లేదు


వాటిని మేము పరిశీలించి ఆమెకు వర్క్‌ ఇవ్వాలని ఫేడరేషన్‌ను ఆదేశించాం. ఇదంతా ఆమె లైంగిక వేధధింపుల ఆరోపణలు చేయకముందు జరిగింది. అప్పటి వరకు ఛాంబర్‌ ఆ అమ్మాయి చేయాల్సింది చేసింది. అయితే ఈ కార్డు విషయంలో జరిగిన విచారణలో లైంగిక వేధింపులు బయటకు వచ్చాయి. మొదట ఆ అమ్మాయి తనకు సరైన వర్క్‌ ఇవ్వడం లేదని, టాలెంట్‌కి తగ్గ గుర్తింపు లేదని చెప్పింది. కానీ దాని వెనక ఈ లైంగిక వేధింపులు ఉన్నాయని తర్వాత బయటపడింది. ఇదంత ఆమె మైనర్‌గా ఉన్నప్పటి నుంచే ఇది జరుగుతుంది. కానీ, ఈ కేసులో మేము జానీ మాస్టర్‌, బాధిత యువతి స్టేట్‌మెంట్‌ని రికార్డు చేసుకున్నాం. అయితే ఆ అమ్మాయి స్టేట్‌మెంట్‌ తీసుకుంటున్నప్పుడు ఈ లైంగిక వేధింపుల కేసు వర్క్ ప్లేస్‌లో జరగలేదని తేలింది.



ఇది చాలా సీరియస్ ఇష్యూ


ఇది చాలా సీరియస్‌ ఇష్యూ, ఈ కేసులో ఛాంబర్‌ ఆమెకు కొంతవరకే రిలీఫ్‌ ఇవ్వగలదు. ఎందుకంటే ఆమె మైనర్‌గా ఉన్నప్పటి నుంచి ఈ లైంగిక వేధింపులు జరిగాయి. చాలా రోజులుగా ఇది జరుగుతుంది కాబట్టి ఆ అమ్మాయికి లీగల్‌ సపోర్టు చాలా అవసరం. అందుకే ఛాంబర్‌ తరపున ఆమె భూమి హెల్ప్‌ లైన్‌ ద్వారా పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలంటే నెల, రెండు నెలలు టైం పడుతుంది. ఈ విషయంలో మీడియా నుంచి వస్తున్న సపోర్టు ప్రశంసనీయం. కానీ ఛాంబర్‌ నుంచి ఆమె న్యాయం కొంతవరకు జరగుతుంది. ఇది పూర్తిగా మా పరిధిలో లేదు. లీగల్‌గా ముందుకు వెళుతున్న ఆ అమ్మాయికి మా మద్దతు ఉంటుంది. ఆమె న్యాయం జరిగిలే చేస్తాం" అంటూ జాన్సీ చెప్పుకొచ్చింది.  


Also Read: లైంగిక వేధింపుల కేసు - జానీ మాస్టర్‌పై నటి పూనమ్‌ కౌర్‌ సంచలన కామెంట్స్‌