దివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌(Telugu Film Chamber Of Commerce)లో జరిగిన ఎన్నికల్లో నిర్మాత దిల్ రాజు ప్యానెల్ విజయం సాధించింది. ఆయన ప్యానెల్‌లో పోటీ చేసిన 12 మందిలో ఏడుగురు విజయం సాధించారు. సి.కళ్యాణ్ ప్యానెల్ నుంచి ఐదుగురు గెలుపొందారు. దిల్ రాజు, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, పద్మిని, స్రవంతి రవికిశోర్, రవిశంకర్ యలమంచిలి, మోహన్‌గౌడ్ విజేతలుగా నిలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1339 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టార్‌లో 891, డిస్ట్రీబ్యూషన్ సెక్టార్‌లో 380, స్టూడియో సెక్టార్‌లో 68 ఓట్లు నమోదయ్యాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లో దిల్ రాజు ప్యానెల్‌కు 563, సి.కళ్యాణ్ ప్యానెల్‌కు 497 ఓట్లు వచ్చాయి.


స్టూడియో సెక్టార్‌లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్ రాజుకు ప్యానెల్‌కు చెందినవారే కావడం గమనార్హం. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్‌లో ఇరువురి ప్యానెల్ నుంచి చెరో ఆరుగురు గెలుపొందారు. ఈ నేపథ్యంలో పదివి ఎవరిని వరిస్తుందనే విషయంపై గందరగోళం నెలకొంది. దిల్ రాజు ప్యానెల్‌కు ఈ నేపథ్యంలో దిల్ రాజు, సి.కళ్యాణ్ సభ్యులు డిస్ట్రబ్యూటర్స్ సెక్టార్‌లో గెలుపొందిన సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. వారిలో ఒకరి మద్దతు దిల్ రాజుకు దొరికినా.. ఆయనే అన్ని సెక్టార్లలో విజేతగా నిలవనున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ ఎన్నికల్లో దర్శకుడు రాఘవేంద్రరావు, ఆదిశేషగిరిరావు, శ్యాంప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, జీవిత, తమ్మారెడ్డి భరద్వాజా, పోసాని కృష్ణమురళి, సుప్రియ, గుణశేఖర్ తదితరులు పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ ఫలితాలు టై కావడంతో.. ఇంకా ఫైనల్ రిజల్ట్ ప్రకటించలేదు. పదవుల విషయంలో ఇరు ప్యానెల్స్ పట్టుదలతో ఉండటంతో మరింత ఆలస్యమవుతోంది. దిల్ రాజ్ ప్యానెల్‌‌లో మొత్తం 24 మంది సభ్యులు గెలవగా.. సి.కళ్యాణ్ ప్యానెల్‌లో 20 మంది గెలిచారు. 25 ఓట్లతో మెజారిటీ సాధించినవారికే TFCC పగ్గాలు దక్కుతాయి.


సీనియర్లు ముందుకు రాకపోవడంతో బరిలోకి...


సీనియర్ నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతోనే TFCC అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు 'దిల్' రాజు ఎన్నికలకు ముందు ప్రకటించారు. ‘‘ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే కిరీటం పెట్టరని, పైగా తనకు ఇంకా సమస్యలు పెరుగుతాయని ఈ సందర్భంగా అన్నారు. అయితే, పరిశ్రమ అభివృద్ధి కోసం తాను ఎన్నికల్లో పోటీ చేయక తప్పడం లేదన్నారు. తమ ప్యానల్ యాక్టివ్ ప్యానల్ అని 'దిల్' రాజు తెలిపారు. చిత్రసీమలో రెగ్యులర్ గా సినిమాలు నిర్మించే వారందరూ తమ ప్యానల్ లో ఉన్నారని చెప్పారు. వాణిజ్య మండలిని బలోపేతం చేసేందుకు తాము ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడానికి సరైన టీమ్ కావాలని, అందుకు తాము ముందుకు వచ్చామని చెప్పారు. 


ఓటు హక్కు ఉన్న నిర్మాతలు 1560.. సినిమాలు తీసేది 200 మందే!


ఛాంబర్ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని 'దిల్' రాజు విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు ఉన్న నిర్మాతలు 1560 మంది ఉన్నారని, అందులో రెగ్యులర్ గా సినిమాలు తీసేది 200 మంది మాత్రమేనని ఆయన తెలిపారు. తాము ఎవరినీ కించపరచడం లేదని, చిత్రసీమ బలోపేతం కావాలంటే అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.


Also Read : శ్రీ లీల 'డేంజర్ పిల్ల' అంటోన్న నితిన్



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial