Teja Sajja's Mirai Collection Records: బాక్స్ ఆఫీస్ బరిలో భారీ కలెక్షన్లతో సూపర్ యోధ తేజా సజ్జా సినిమా 'మిరాయ్' దూసుకు వెళుతోంది. రెండు రోజుల్లో రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. రూ. 55 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందరి చేత ఔరా అనిపించింది. ఇప్పుడీ సినిమా ఖాతాలో ఓ ఇండస్ట్రీ రికార్డ్ కూడా పడింది.
టైర్ 2 హీరోల్లో ఆల్ టైమ్ రికార్డ్...తెలుగు స్టేట్స్‌లో 2 రోజు భారీ కలెక్షన్!బాక్స్ ఆఫీస్ వద్ద తేజ సజ్జా (Teja Sajja) కథానాయకుడిగా నటించిన 'మిరాయ్' మూవీ సెన్సేషన్ కంటిన్యూ అవుతోంది. మిడ్ రేంజ్ హీరోల సినిమాల విషయంలో, టైర్ 2 హీరోల కలెక్షన్స్ విషయంలో సెకండ్ డే ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది 'మిరాయ్'. ఇంతకు ముందు ఉన్న సినిమాల రికార్డులు బద్దలు కొట్టింది.
తెలుగు స్టేట్స్ ఏపీ, తెలంగాణ కలెక్షన్స్ విషయంలో రూ. 8 కోట్ల 20 లక్షల షేర్ సాధించి ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించాడు తేజ సజ్జా. పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి క్రౌడ్ పుల్లర్స్, సీనియర్ స్టార్ హీరోలు చిరు, బాలయ్య, నాగ్, వెంకీలను పక్కన పెడితే... నాని 'హిట్ 3', 'శ్యామ్ సింగ రాయ్', 'దసరా', విజయ్ దేవరకొండ 'ఖుషి', 'కింగ్‌డమ్', 'గీత గోవిందం' సహా నాగ చైతన్య 'తండేల్', 'లవ్ స్టోరీ', 'మజిలీ' సినిమాల కంటే సెకండ్ డే 'మిరాయ్' ఎక్కువ కలెక్ట్ చేసింది. ఆ మూవీస్ కలెక్షన్లను ఈ సినిమా క్రాస్ చేసింది. రెండో రోజు తెలుగు స్టేట్స్ హిస్టరీలో మీడియం రేంజ్ సినిమాలలో హైయ్యస్ట్ షేర్ వచ్చిన సినిమాగా 'మిరాయ్' రికార్డు క్రియేట్ చేసింది.
Also Read: వరాహ రూపం చూసి థియేటర్లలో ఏడ్చిన పంజాబీ స్టార్... కాంతార కోసం దిల్జిత్ పాట
'మిరాయ్'లో సూపర్ యోధగా తేజ సజ్జా నటనకు ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. యాక్షన్ సీన్స్ డూప్ లేకుండా అద్భుతంగా చేశారు తేజ. కామెడీ టైమింగ్ కూడా బావుంది. తెలుగు కాకుండా ఇతర భాషల ప్రేక్షకుల నుంచి తేజ నటనకు యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ సినిమాతో టాలీవుడ్ టైర్ 2 హీరోలలో తేజ సజ్జా టాప్ లీగ్‌లో వచ్చినట్లు అయ్యిందని ట్రేడ్ వర్గాల విశ్లేషణ. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన 'మిరాయ్'ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.
Also Read: తెలుగులో 'ఇడ్లీ కొట్టు'గా ధనుష్, నిత్యా మీనన్ సినిమా... రిలీజ్ ఎప్పుడంటే?